Amoeba: అమ్మో.. అమీబా.. 11 మంది ప్రాణాలు తీసింది..

పాకిస్థాన్‌లో మెదడును తినే అమీబా 11 మంది ప్రాణాలను బలిగొనడం కలకలం రేపుతుంది. గత రెండు వారాల్లో దీని బారినా పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరొకరు మృతి చెందారు. ఈ ప్రాణాంతక అమీబా పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

New Update
Amoeba: అమ్మో.. అమీబా.. 11 మంది ప్రాణాలు తీసింది..

ఇప్పటికే కరోనా వైరస్ వల్ల ప్రపంచదేశాలు అతలాకుతలమయ్యాయి. ఎంతోమంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే పాకిస్థాన్‌లో ఇప్పుడు మరో ముప్పు కలకలం రేపుతోంది. అక్కడ పలు రాష్ట్రాలు మెదడును తినే అమీబా బారిన పడ్డాయి. ఈ అమీబాను నేగ్లేరియా ఫౌలెరి అని అంటారు. అయితే ఈ అమీబా బారిన పడి 11 ప్రాణాలు కోల్పోయారు. ఈ నేగ్లేరియా ఫౌలెరికి ఎక్కువగా కరాచీ ప్రాంతం ప్రభావితమైంది. గత రెండు వారాల్లో చూసుకుంటే కరాచీలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో ఈ అమీబా వల్ల ముగ్గురు మృతి చెందారు. తాజాగా 45 ఏళ్లున్న అద్నాస్ అనే వ్యక్తి ఈ అమీబా బారినపడి మృత్యువాతపడ్డాడు.

Also Read: గాజాలో శరణార్ధుల శిబిరాల మీద ఇజ్రాయెల్ దాడి..73మంది మృతి

గత మూడు రోజులుగా అతడు జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నాడని.. నేగ్లేరియా వల్ల మృతి చెందినట్లు సింధ్ ఆరోగ్య శాఖ తెలిపింది. పాకిస్థాన్‌లో ఇప్పటిదాకా 11 మంది ఈ వ్యాధిబారిన పడి మృతి చెందడం ఆందోళనకరంగా మారింది. సింధ్ తాత్కాలిక ఆరోగ్య మంత్రి డాక్టర్‌ సాద్ ఖలీద్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇది అరుదైన ప్రాణాంతక అమీబా అని.. ఇది మంచినీటి వనరులలో పెరుగుతుందని చెప్పారు. అలాగే క్లోరినేషన్ చేయనటువంటి కొలనుల్లో.. ఈతకు దూరంగా ఉండాలని తెలిపారు. ముక్కులోకి నీరు ప్రవేశించేందుకు అవకాశమిచ్చే వాటికి కూడా దూరంగా ఉండాలంటూ సూచనలు చేశారు.

Also read: అధికారితో బలవంతంగా పంట వ్యర్థాలను దగ్ధం చేయించిన రైతులు..

Advertisment
Advertisment
తాజా కథనాలు