Brane IT Company Layoffs : ఐటీ కారిడార్‌లోని బ్రేన్ అనే ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 1,500 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వివిధ రకాల బిజినెస్ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్ ఇచ్చింది. మూడు నెలల జీతం ఇవ్వకుండానే లేఆఫ్స్ ప్రకటించింది. మాదాపూర్ మైండ్స్పేస్బిల్డింగ్ నం. 3ఏలోని మూడు, నాలుగు ఫ్లోర్లలో బ్రేన్ ఎంటర్ప్రైజెస్ప్రైవేట్ లిమిటెడ్ (Brane Enterprises Private Ltd) పేరుతో ఐటీ కంపెనీ రన్ అవుతుంది.
ఈ కంపెనీకి బెంగళూరు, సింగపూర్‌లో కూడా బ్రాంచులు ఉన్నాయి. హైదరాబాద్ (Hyderabad) బ్రాంచ్‌లో దాదాపు 3వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలోని 1,500 మందిని తాజాగా ఉద్యోగాల నుంచి తొలగించింది. ఉన్నపళంగా తొలగించడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేన్కంపెనీ మూడు నెలలుగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. మార్చి నెలలో ఒకటో తేదీన పడాల్సిన జీతాలను 18న చెల్లించారని తెలిపారు. కొందరికి ఏప్రిల్‌నెల మధ్యలో వేశారని తెలిపారు.
కొందరికి ఏప్రిల్, మే నెల చివరి రోజుల్లో జీతంలో పది శాతం మాత్రమే ఇచ్చారని తెలిపారు. మే నెల నుంచి జీతాలు ఇవ్వకుండా తేదీలు మార్చుతూ వస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. తాజాగా హెచ్ఆర్ను సంప్రదిస్తే ఈ రోజు రేపు అంటూ మెయిల్స్ పంపించారని, చివరికి ఉద్యోగాల నుంచే తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 13న బిజినెస్కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని లీడర్షిప్ ఆపరేషన్స్పేరిట మెయిల్స్వచ్చాయని తెలిపారు.
సెప్టెంబర్2 వరకు నోటీస్ పీరియడ్‌గా ఉండగా చెప్పారు. సెప్టెంబర్ 2లోపు జీతాలు చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్స్వచ్చాయంటున్నారు. దీనిపై బాధితులు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) జాయింట్లేబర్ కమిషనర్‌ను కలిసి కంపెనీపై ఫిర్యాదులు అందజేశారు.
Also Read: గుడ్లవల్లేరు లేడీస్ హాస్టల్ లలో సీసీ కెమెరాలు.. ఘటనపై ఎస్పీ షాకింగ్ కామెంట్స్..!