Hyderabad IT Layoffs : హైదరాబాద్ లో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐటీ కంపెనీ.. ఒకే సారి 1500 మంది ఔట్!

హైదరబాద్‌ లోని బ్రేన్​అనే ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 1,500 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వివిధ రకాల బిజినెస్‌ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్‌ ఇచ్చింది. కనీసం వారికి 3 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించట్లేదు.

New Update
Startup Layoffs: ఆగని లేఆఫ్‌లు.. వేల మంది ఉద్యోగుల తొలగింపు..!

Brane IT Company Layoffs : ఐటీ కారిడార్​లోని బ్రేన్ అనే ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 1,500 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వివిధ రకాల బిజినెస్‌ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్‌ ఇచ్చింది. మూడు నెలల జీతం ఇవ్వకుండానే లేఆఫ్స్​ ప్రకటించింది. మాదాపూర్ మైండ్​స్పేస్​బిల్డింగ్​ నం. 3ఏలోని మూడు, నాలుగు ఫ్లోర్లలో బ్రేన్ ఎంటర్​ప్రైజెస్​ప్రైవేట్ లిమిటెడ్​ (Brane Enterprises Private Ltd) పేరుతో ఐటీ కంపెనీ రన్‌ అవుతుంది.

ఈ కంపెనీకి బెంగళూరు, సింగపూర్​లో కూడా బ్రాంచులు ఉన్నాయి. హైదరాబాద్ (Hyderabad)​ బ్రాంచ్​లో దాదాపు 3వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలోని 1,500 మందిని తాజాగా ఉద్యోగాల నుంచి తొలగించింది. ఉన్నపళంగా తొలగించడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేన్​కంపెనీ మూడు నెలలుగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. మార్చి నెలలో ఒకటో తేదీన పడాల్సిన జీతాలను 18న చెల్లించారని తెలిపారు. కొందరికి ఏప్రిల్​నెల మధ్యలో వేశారని తెలిపారు.

కొందరికి ఏప్రిల్, మే నెల చివరి రోజుల్లో జీతంలో పది శాతం మాత్రమే ఇచ్చారని తెలిపారు. మే నెల నుంచి జీతాలు ఇవ్వకుండా తేదీలు మార్చుతూ వస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. తాజాగా హెచ్ఆర్​ను సంప్రదిస్తే ఈ రోజు రేపు అంటూ మెయిల్స్​ పంపించారని, చివరికి ఉద్యోగాల నుంచే తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 13న బిజినెస్​కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని లీడర్​షిప్​ ఆపరేషన్స్​పేరిట మెయిల్స్​వచ్చాయని తెలిపారు.

సెప్టెంబర్​2 వరకు నోటీస్​ పీరియడ్​గా ఉండగా చెప్పారు. సెప్టెంబర్ 2లోపు జీతాలు చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్స్​వచ్చాయంటున్నారు. దీనిపై బాధితులు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) జాయింట్​లేబర్ కమిషనర్​ను కలిసి కంపెనీపై ఫిర్యాదులు అందజేశారు.

Also Read: గుడ్లవల్లేరు లేడీస్ హాస్టల్ లలో సీసీ కెమెరాలు.. ఘటనపై ఎస్పీ షాకింగ్ కామెంట్స్..!

Advertisment
తాజా కథనాలు