/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/serial-jpg.webp)
Brahmamudi Serial Today Episode : కళ్యాణ్(Kalyan), అనామిక(Anamika) పెళ్లి చెడగొట్టాలని కావ్య(Kavya) తన పుట్టింటివాళ్లతో కలిసి ప్లాన్ చేసిందని ధాన్యలక్ష్మితో పాటు ఇంట్లో అందరూ అపోహపడుతుంటారు. కళ్యాణ్, అనామికలకు కావ్య హారతి ఇవ్వడానికి కూడా ధాన్యలక్ష్మి ఒప్పుకోదు. అందరూ కావ్యను దోషిని చేస్తూ ద్వేస్తుంటారు. నానా మాటలు అంటూ ఇన్ డైరెక్ట్ గా తిడుతుంటారు. కానీ భర్త రాజ్ మాత్రం కావ్యకు అండగా నిలస్తాడు. కావ్య వ్యక్తిత్వాన్ని అందరికి అర్ధమయ్యేలా చెబుతాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/serial-2-jpg.webp)
Also Read: దట్ ఇజ్ సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీని ఇందుకే ఇష్టపడుతారా.!
ఉదయాన్నే లేచి కుటుంబసభ్యుల కోసం వంట చేస్తుంది కావ్య. అందరికి వడ్డించాలని అనుకుంటుంది. కానీ, కావ్య వడ్డిస్తే తిననని చెప్పి అత్త అపర్ణ తానే వడ్డించుకుంటుంది. చిన్న అత్త ధాన్యలక్ష్మికి వడ్డించడానికి వెళుతుంది కావ్య. అయితే, నాకు ఏం కావాలో తెలుసు..నీ సహాయం అక్కరలేదని కావ్యను తిట్టేస్తుంది ధాన్యలక్ష్మి(Dhanyalakshmi). ఇక రుద్రాణి ఎంటరై ఇన్నాళ్లు కావ్యను ఎవరైన ఏమైనా అంటే మెరుపుతీగలా సర్రున పరుగెత్తుకొచ్చేదానికి కదా అంటూ ధాన్యలక్ష్మిపై సెటైర్ వేస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/serial-4-jpg.webp)
దీంతో, నాకు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆలస్యంగా అర్థమైందని రుద్రాణికి బదులిస్తుంది అత్త ధాన్యలక్ష్మి. ఎవరిని జీవితంలో అతిగా నమ్మకూడదని కావ్యను చూస్తూ మాట్లాతుంది. ఆమె మాటలతో కావ్య ఎంతో బాధపడుతుంది. కావ్యను తన ఫ్యామిలీ మొత్తం ద్వేషిస్తున్నారని హీరో రాజ్ అర్థం చేసుకుంటాడు. తనకు సపోర్ట్‌గా ఉండాలని ఫిక్స్ అవుతాడు రాజ్. కావ్య చేసిన వంటలను మెచ్చుకుంటూ తింటాండు. ఆ సీన్ ను చూసి అపర్ణ, ధాన్యలక్ష్మి షాక్ అవుతారు.
 Follow Us