Sai Pallavi: టాలీవుడ్ లేడీ పవర్ స్టార్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా మూవీతో అందరిని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో పాటు ఆమె సింప్లిసిటీని ఇష్ట పడని వారంటూ ఉండరూ. ఈ అందాల భామకు ఆధ్యాత్మిక కూడా చాలా ఎక్కువే.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని పలువురు హీరోయిన్లు పార్టీ, బీచ్ లంటూ హల్ చల్ చేస్తుంటే ఈ అమ్ముడు మాత్రం కొత్త సంవత్సరాన్ని దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మికతతో జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Sai Pallavi today at Puttaparthi Sai Baba Temple for #NewYear Celebrations 🙏✨♥️#SaiPallavi @Sai_Pallavi92 #HappyNewYear2024 pic.twitter.com/P8RLuIHmuN
— Sai Pallavi FC™ (@SaipallaviFC) January 1, 2024
పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆలయం ‘ప్రశాంతి నిలయం’లో జరిగిన ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్నారు సాయి పల్లవి. చీర కట్టు, నిదుటన బొట్టుతో సంప్రదాయబద్ధంగా భజనలో పాల్గొన్నారు. కొత్త సంవత్సర సందర్భాన్ని దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మికతతో జరుపుకున్నారు. సత్యసాయి సన్నిధిలో కళ్లు మూసుకొని ఆధ్యాత్మికతలో మునిగిపోయారు సాయి పల్లవి.
సినీ సెలెబ్రిటీలతో పోలిస్తే భిన్నంగా ఆధ్యాత్మికతతో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడంతో నెటిజన్లు ఆమెని తెగ పొగిడేస్తున్నారు. దట్ ఇజ్ సాయి పల్లవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాయి పల్లవి సినిమాలు చేసినా, చేయకపోయినా ఆమె కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. కోట్లు కుమ్మరించినా వాణిజ్య ప్రకటనలకు మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఎంత డబ్బు ఇచ్చినా సరే హద్దు దాటే సీన్లకు ఒప్పుకోదు. అందుకే ఈ హీరోయిన్ అంటే అభిమానులకు అంత ప్రేమ.
Also Read: ‘ఈ సారి రూల్ పుష్పదే’.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్