Brahmamudi Serial Today Episode: బిడ్డ విషయంలో భర్త రాజ్ దాచిన రహస్యాన్ని తెలుసుకున్న కావ్య షాకవుతుంది. ఆ బిడ్డకు అసలు తండ్రి మామ సుభాష్ అని తెలియగానే అయోమయంలో ఉండిపోతుంది. మావయ్య తప్పు చేశాడని తెలిస్తే అత్తయ్య ప్రాణాలతో ఉండదు అని మనసులో బాధపడుతుంది కావ్య. ఈ సమస్యకు పరిష్కారం చూపించమని దేవుడితో కన్నీళ్లు పెట్టుకుంది కావ్య.
మరో వైపు అపర్ణ పెట్టిన గడువు ప్రకారం రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. దీంతో ఇంట్లో అందరు ఏం జరగబోతుందా అని ఆసక్తికరంగా ఉంటారు. రాజ్ బిడ్డ గురించి నిజం బయటపెడతాడా..? లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా..? అని ఆలోచిస్తూ ఉంటారు.
ఇంతలో ప్రకాశం రాజ్ విషయం గురించి భార్య ధాన్యలక్ష్మితో మాట్లాడుతూ బాధపడతాడు. ధాన్యలక్ష్మి మాత్రం రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయినా పర్వాలేదన్నట్లుగా మాట్లాడుతుంది. దీంతో ప్రకాశం ఇదే నీ సొంత కొడుకు కళ్యాణ్ అయితే ఇలా మాట్లాడతావా..? అని భార్యకు గడ్డి పెడతాడు.
ఆ తర్వాత కావ్య చెల్లెలు అప్పు దగ్గరకు వెళ్తుంది. కావ్య మావయ్యనే బిడ్డకు తండ్రి అని తెలుసుకున్న అప్పు కూడా షాకవుతుంది. వెంటనే వెళ్లి నిజం బయటపెట్టు అని అక్క కావ్యకు సలహా ఇస్తుంది. కానీ కావ్య అలా చేయలేను అని చెప్తుంది.
డబ్బుల కోసం మార్వాడి అతను రుద్రానికి ఫోన్ చేస్తాడు. మరో రెండు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే.. మీరే ఆస్తి పేపర్స్ తాకట్టు పెట్టారని ఇంట్లో చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న ఏమీ తెలియనట్లు.. రుద్రాణితో డబ్బుల గురించి వెటకారంగా మాట్లాడుతుంది.
మరో వైపు రాజ్ బాబును ఆడిస్తూ ఉంటాడు. ఇంతలో గదిలోకి వచ్చిన కావ్య.. తండ్రి కోసం భర్త పడుతున్న అవమానాలను తలుచుకొని బాధపడుతుంది. తల్లి కోసం భర్త చేస్తున్న త్యాగాన్ని చూసి గర్వపడుతుంది.
ఆ తర్వాత రాజ్ హాల్లోకి రాగానే అపర్ణ కోప్పడడం స్టార్ట్ చేస్తుంది. నీకు ఇచ్చిన గడువు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆ బిడ్డ ఎవరనే నిజాన్ని బయట పెడతావా..? లేదా అని కొడుకు రాజ్ ను నిలదీస్తుంది. రేపటి లోపు నిజం చెప్పకపోతే తానే ఇంటి నుంచి వెళ్లిపోతానని అందరికీ షాకిస్తుంది అపర్ణ. నేటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.