Brahmamudi : అమ్మవారి అవతారమెత్తిన కనకం.. రాహుల్, రుద్రాణికి దిమ్మతిరిగే షాకిచ్చిన స్వప్న..!

ఆస్తి పేపర్స్ ఎలా బయటకి వెళ్ళాయో తెలుసుకోవడానికి తల్లి కనకంతో కలిసి సూపర్ ప్లాన్ వేస్తుంది స్వప్న. దాని కోసం కనకం అమ్మోరు గెటప్ వేసి వడ్డీ వ్యాపారిని భయపెడుతుంది. దీంతో రాహుల్, రుద్రాణి చేసిన కుట్ర అంతా బయటపెడతాడు ఆ వ్యాపారి. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi :  అమ్మవారి అవతారమెత్తిన కనకం.. రాహుల్, రుద్రాణికి దిమ్మతిరిగే షాకిచ్చిన స్వప్న..!

Brahmamudi Serial Today Episode : ఫోన్ లో బ్లాక్ మెయిల్(Black Mail) చేసి పది లక్షలు అడిగిన వ్యక్తికి.. రాజ్(Raj) డబ్బులు ఇచ్చేసి ఇంటికి వస్తాడు. భర్త వెంట ఫాలో అయినా కావ్య(Kavya) కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇక రాజ్ రూమ్ లోకి రాగానే వెనకాలే కావ్య రావడంతో రాజ్ కు డౌట్ వస్తుంది. తనను ఫాలో అయ్యిందా ఏంటీ..? అని మనసులో అనుకుంటాడు. దీంతో ఎక్కడికి వెళ్ళావు అని భార్యను అడుగుతాడు రాజ్.

Raj - Kavya

రాజ్ డౌట్ రాకూడదని భావించిన కావ్య బాబు కోసం డైపర్స్ తీసుకురావడానికి వెళ్లినట్లు కవర్ చేస్తుంది. ఆ తర్వాత బిడ్డ తల్లి గురించి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్న కావ్య.. ఎలాగైనా రాజ్ కు ఫోన్ చేసి డబ్బులు అడిగిన వ్యక్తి నెంబర్ కనుక్కోవాలని ప్లాన్ చేస్తుంది.

Raj - Kavya
బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి నెంబర్ కనుక్కోవడానికి ఒకసారి మీ ఇవ్వండి అని రాజ్ ను అడుగుతుంది కావ్య. దీంతో రాజ్ ఎందుకు అని అడిగేసరికి నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు.. మా ఇంటికి ఫోన్ చేయాలి అని అబద్దం చెప్పి రాజ్ ఫోన్ తీసుకుంటుంది.

Raj - Kavya
ఆ తర్వాత రాజ్ ఫోన్ లో నుంచి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి నెంబర్ తీసుకున్న కావ్య .. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోమని చెల్లి అప్పు(Appu) కు చెప్తుంది.

Kavya Appu

మరో వైపు ఆస్తి పేపర్స్ వడ్డీ వ్యాపారీ తో ఎవరు తాకట్టు పెట్టారో తెలుసుకోవడానికి తల్లి కనకంతో కలిసి సూపర్ ప్లాన్ వేస్తుంది కావ్య.

Kanakam

వడ్డీ వ్యాపారి చేత అసలు నిజం బయపెట్టించాలని అమ్మవారి వేషం వేసుకొని అతన్ని భయపెడుతుంది కనకం. దీంతో దీంతో రాహుల్, రుద్రాణి చేసిన కుట్ర అంతా బయటపెడతాడు ఆ వ్యాపారీ. ఇక అసలు నిజం తెలుసుకున్న స్వప్న ఇంటికి వస్తుంది.

Kanakam
మరో వైపు ఆస్తి తమ సొంతం కాబోతుంది అని భావించిన రుద్రాణి, రాహుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అసలు నిజం తెలుసుకున్న స్వప్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏంటి రాహుల్ ఆస్తి పేపర్స్ గురించి నేను బాధపడుతుంటే.. మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Rudhrani - Rahul - Swapna

Also Read: Ramayanam : ‘రామాయణం’ నుంచి మరో అప్డేట్ వైరల్.. కైకేయి పాత్రలో లారా దత్తా..!

Advertisment
తాజా కథనాలు