Brahmamudi : భర్తను వదిలేయడానికి సంతకం పెట్టిన కావ్య.. కోడలి పై అసహ్యంతో రగిలిపోతున్న అపర్ణ..!

మాయతో రాజ్ పెళ్ళికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సంతకం చేస్తుంది కావ్య. దీంతో ఇంట్లో అందరు షాకవుతారు. రుద్రాణి, మాయ మాత్రం సంబరపడుతూ ఉంటారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi : భర్తను వదిలేయడానికి సంతకం పెట్టిన కావ్య.. కోడలి పై అసహ్యంతో రగిలిపోతున్న అపర్ణ..!

Brahmamudi Daily Serial : నేటి ఎపిసోడ్ (Today Episode) లో బాబుతో నానా అవస్థలు పడుతుంటారు రుద్రాణి, మాయ (Maya). బాబు ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న (Swapna).. బాబు ఏడుస్తుంటే ఎద్దులా చూస్తూ ఉన్నారేంటి అని మాయ, రుద్రానికి క్లాస్ పీకుతుంది. publive-image  బాబు ఏడుపు చూస్తూ ఉండలేకపోయిన స్వప్న.. పాలు పట్టొచ్చుగా అని అంటుంది. దీంతో రుద్రాణి (Rudhrani) పాలు రావుగా అని నోరు జారుతుంది. ఇక స్వప్న బిడ్డ తల్లికి పాలు రాకపోవడమేంటి నాకు అనుమానంగా ఉంది అని మాయ పై డౌట్ పడుతుంది. దీంతో రుద్రాణి చాలా రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు కదా అందుకే రావడం లేదని కవర్ చేస్తుంది.

publive-image

మరో వైపు మాయతో రాజ్ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న అపర్ణ హాల్లో మళ్ళీ పంచాయతీ పెడుతుంది. రాజ్ మాయను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నట్లు ఈ నో ఆబ్జెక్షన్ పత్రాలపై సంతకం చేయి అని అపర్ణ అడుగుతుంది. దీంతో కావ్యతో పాటు ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

publive-image

అపర్ణ మాటలను రాజ్ ఖండిస్తాడు. కళావతి మాయతో నా పెళ్ళికి ఒప్పుకున్నా..? మాయ తాళి కట్టించుకునేందుకు సిద్ధంగా ఉన్నా..? ముందుగా దీనికి ఒప్పుకోవాల్సింది నేను కదా మమ్మీ అని అపర్ణను అడుగుతాడు. దీంతో అపర్ణ తప్పు చేసిన నువ్వు.. మాట్లాడే అర్హతను ఎప్పుడో కోల్పోయావు అని రాజ్ పై కోప్పడుతుంది.

publive-image

ఇక సంతకం పెట్టను అని అంటే .. మరి మాయను ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. అప్పుడు అసలు నిజం చెప్పాల్సి వస్తుంది. ముందు అయితే సంతకం చేస్తాను. ఆ తర్వాత పెళ్లికి మధ్య ఉండే గ్యాప్ లో అసలు మాయను తీసుకొచ్చి నిజం బయటపెడతాను అని మనసులో అనుకుంటుంది కావ్య.

publive-image

తాను మనసులో అనుకున్న ప్లాన్ ప్రకారం సంతకం చేయడానికి ఒప్పుకుంటుంది కావ్య. నా భర్తకు మాయను ఇచ్చి పెళ్లి చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెబుతుంది. ఏడుస్తూ సంతకం చేస్తుంది కావ్య. దీంతో అందరు షాక్ అవుతారు. రుద్రాణి, మాయ మాత్రం తెగ సంబర పడుతూ ఉంటారు.

publive-image

కావ్య మనసు తెలియని అపర్ణ కోడలిని అపార్థం చేసుకుంటుంది. నీ గురించి రుద్రాణి చెబితే నమ్మలేదు.. నీకు కేవలం ఆస్తి.. ఈ కోడలి హోదా మాత్రమే కావలి. అంతే కానీ భర్త, బంధాలు అవసరం లేదు అందుకే సంతకం చేశావు. ఛీ.. నువ్వు ఇప్పుడు నా దృష్టిలో పాతాళంలోకి పడిపోయావు అని కావ్యను అసహ్యించుకుంటుంది.

publive-image

ఇంతలో బాగా చెప్పావు.. అపర్ణ అని ఇందిరాదేవి ఎంట్రీ ఇస్తుంది. నేటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఎందుకిలా చేశావని కావ్యను ప్రశ్నిస్తాడు రాజ్.

publive-image

Also Read: Deepika Padukone: దీపికకు అరుదైన గౌరవం.. అందులో ఆమె టాప్‌! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు