Brahmamudi Serial Today Episode : రాజ్ (Raj), కావ్య (Kavya) కు.. విడాకులు (Divorce) ఇప్పించాలని అపర్ణ తీసుకున్న నిర్ణయాన్ని ఇందిరాదేవి, సీతారామయ్య వ్యతిరేకిస్తారు. మరో వైపు కావ్య కూడా నా భర్తతో విడాకులు తీసుకునే ప్రసక్తే లేదు అని అత్త అపర్ణతో తెగేసి చెప్తుంది. ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరు ఎలా ఇస్తారు. తప్పు చేసిన మీ కొడుకును వదిలేసి నాకు ఎలా అన్యాయం చేస్తారు అని అపర్ణను కడిగిపారేస్తుంది.
ఇక కావ్య విడాకుల విషయంలో తన నిర్ణయాన్ని చెప్పిన తీరుపై ఇందిరాదేవి ప్రశంసలు కురిపిస్తుంది. శభాష్ మనవరాలా.. ఆడతనం అంటే ఇది...పెళ్లికి ముందే తొందరపడి తప్పు చేసిన ఆడదానికి.. నా మనవరాలి ముందు నిలబడే అర్హత లేదని మాయకు ఝలక్ ఇస్తుంది.
ఆ తర్వాత అపర్ణ బయట వెళ్లి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి అపర్ణ పై సెటైర్లు వేయడం మొదలుపెడుతుంది. నీ పరివారం అంత ఎక్కడ? నువ్వు ఈ కోటకు మహారాణివి? నువ్వు ఆజ్ఞలు వేస్తే పాటించడం తప్పితే ఈ ఇంట్లో నీకు ఎవరూ ఎదురునిలబడలేరు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. కావ్యకు విడాకులు ఇప్పించి మాయతో రాజ్ కు పెళ్లి చేయాలనుకుంటే కుదరదు అని కోడలు అపర్ణ (Aparna) కు గడ్డి పెడుతుంది.
కావ్య విడాకులకు ఒప్పుకోకపోవడంతో మాయ షాకవుతుంది. మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని రుద్రాణితో చెబుతూ ఉంటుంది. దీంతో రుద్రాణి.. పద్దతిగా కనిపిస్తుందని కావ్య గురించి తక్కువగా అంచనా వేయకు. తేడా వస్తే ఎవరిని వదిలిపెట్టదదు అని కావ్య గురించి క్లారిటీ ఇస్తుంది మాయకు. విలువల కోసం మాత్రమే ఈ కష్టాలను భరిస్తుంది అని చెబుతుంది.
విడాకులు ఇవ్వనని చెప్పడంతో కావ్యకు థ్యాంక్స్ చెప్తాడు రాజ్. నువ్వు విడాకులు ఇచ్చుంటే ... మా అమ్మ మాయతో నా పెళ్లి చేసింది అని కావ్యతో అంటాడు. దీంతో కావ్య.. అంటే మాయతో పెళ్లి చేస్తారని అని మాత్రమే మీ భయం.. అంతే కానీ నా పై ప్రేమతో కాదు అని భర్తతో గొడవ పడుతుంది. మాయ మంచిది అయితే నేను విడాకులు ఇచ్చినా పర్లేదా అని రాజ్ బుర్ర తింటుంది. ఇక రాజ్.. నువ్వు నాకు ఎందుకు విడాకులు ఇచ్చే రకమా.. జీవితాంతం నన్ను సాధిస్తూనే ఉంటావే అని వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత కావ్య.. నా పై ఉన్న ప్రేమను మీ నోటితోనే బయటపెట్టేలా చేస్తాను అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో రాజ్, మాయ పెళ్లికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదని నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పై సంతకం చేయమని కావ్యకు షాకిస్తుంది అపర్ణ.