Brahmamudi: ఇంట్లో కావ్యకు అవమానం.. మాయకు సపోర్ట్ గా అత్త అపర్ణ..! రాజ్ ఏం చేయబోతున్నాడు..?

అపర్ణ అనుకున్నట్లుగానే రాజ్, మాయకు పెళ్లి చేస్తే.. కావ్య జీవితం ఏమైపోతుందో అని కంగారు పడతాడు సుభాష్. మరో వైపు ఇంటి కోడలిగా అధికారం చెలాయించాలనే ప్లాన్ లో ఉంటుంది మాయ. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi: ఇంట్లో కావ్యకు అవమానం.. మాయకు సపోర్ట్ గా అత్త అపర్ణ..! రాజ్ ఏం చేయబోతున్నాడు..?

Brahmamudi Serial Today Episode: అనామిక ఒంటరిగా రూమ్ లో ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ వస్తాడు. ఇక భర్త రాగానే కావ్య గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది అనామిక. మీ వదిన గురించి చెబితే ఏమో అనుకున్నా.. కానీ మాములు తెలివైంది కాదు. ఏకంగా బిడ్డ తల్లిని ఇంటికే తీసుకొచ్చింది. అసలు అలా ఎవరు దైర్యం చేయలేరు. నేను అయితే అస్సలు చేయను అని కళ్యాణ్ తో అంటుంది.

publive-image

ఇక అనామిక మాటలు విన్న కళ్యాణ్.. నీకు వదినకు జరిగినది చూసి నీకు సంతోషంగా ఉంది కదా అని అంటాడు. ఆ తర్వాత అనామిక .. కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అంటుంది. దీంతో కళ్యాణ్ అలా అని నీకెవరు చెప్పారు అంటూ అనామిక పై సీరియస్ అవుతాడు. దీంతో అనామిక మరి బిడ్డ తల్లికి న్యాయం చేయాలంటే.. రాజ్ బావతో మాయకు పెళ్లి చేయాల్సిందే. ఇక పెళ్లి అయిన మరు క్షణం కావ్య వెళ్లిపోవాల్సిందే కదా అని కళ్యాణ్ తో అంటుంది.

publive-image
మరో వైపు సుభాష్ బిడ్డ తల్లితో రాజ్ పెళ్లి చేయాలన్న అపర్ణ మాటలు గుర్తు చేసుకుంటాడు. ఒకవేళ అపర్ణ అనుకున్నట్లుగానే రాజ్ తో మాయ పెళ్లి చేస్తే.. కావ్య జీవితం ఏమైపోతుంది అని మనసులో బాధపడతాడు. ఈ దారుణం జరగముందే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు.

Brahmamudi Serial Today Episode

ఇక ఇందిరాదేవి, సీతారామయ్య ఇంట్లో కావ్య పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటారు. రాజ్ చేసిన తప్పుకు కావ్యకు శిక్ష వేయడం కరెక్ట్ కాదు. నాది స్వార్థమే అనుకోండి.. నాకు మాత్రం కావ్యకు న్యాయం చేయాలని ఉంది అని భర్త సీతారామయ్యతో చెబుతుంది ఇందిరాదేవి.

Brahmamudi Serial Today Episode

ఆ తర్వాత సుభాష్ మాయను కలిసి మాట్లాడతాడు. నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తాను. నీ దారిన నువ్వు వెళ్లిపో అని మాయకు చెప్తాడు సుభాష్ . దానికి మాయ.. అయిన ఇంత పెద్ద కుటుంబంలో మహారాణిలా బతికే అవకాశం ఉండగా, మీరిచ్చే చిల్లరికి ఎవరైనా ఆశపడతారా అని సుభాష్ కు షాకిస్తుంది.

publive-image
మరో వైపు కావ్య వంట గదిలో అందరికీ కాఫీలు తయారు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మాయ.. అయ్యో చెల్లి ఎందుకు కష్టపడుతున్నావు. నేను ఇస్తాను కదా అని కాఫీలు తీసుకుంటుంది. దీంతో కావ్య నువ్వు ఇచ్చిన.. అక్కడ ఎవరూ తీసుకోరు అని చెబుతుంది. దానికి మాయ అలాగా చూద్దాం అని బదులిస్తుంది.

publive-image
కాఫీ తీసుకొని హాల్లోకి వస్తుంది మాయ. ఇంతలోనే రుద్రాణి.. ఈ ఇంట్లో ఒక్కక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంది అని అంటుంది. దీంతో మాయ మీ అందరికి ఇష్టమైనవి అన్ని ఇక్కడ ఉన్నాయి అని అంటుంది. దానికి ధాన్యలక్ష్మి.. మా అందరికీ ఇష్టమైనవి నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. వెంటనే రుద్రాణి ఇంకెవరు చెప్తారు వదినా.. రాజ్ చెప్పి ఉంటాడు అని వెటకారంగా మాట్లాడుతుంది. మాయ టీ ఇవ్వడానికి వెళితే ఇందిరాదేవి ఇష్టపడదు, కానీ అపర్ణ మాత్రం కాఫీ తీసుకుంటుంది. నేటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi Serial Today Episode

Also Read: Love Me Release Trailer: దెయ్యంతో ప్రేమ కథ..! ఆసక్తికరంగా లవ్ మీ ట్రైలర్ - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు