Brahmamudi Serial: అసలు నిజం బయటపెట్టిన రాజ్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శ్వేత..! రాహుల్, రుద్రాణి కుట్రకు చెక్ పెట్టిన స్వప్న

బాబు గురించి నిజం తెలుసుకున్న శ్వేత రాజ్ పై కోపంతో వెళ్ళిపోతుంది. మరో వైపు ఆ బాబు ఎవరని ఆఫీస్ లో అందరు రకరకాలుగా మాట్లాడడం మొదలు పెడతారు. దీంతో కావ్య వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: అసలు నిజం బయటపెట్టిన రాజ్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శ్వేత..! రాహుల్, రుద్రాణి కుట్రకు చెక్ పెట్టిన స్వప్న

Brahmamudi Serial: రుద్రాణి, రాహుల్..రాజ్ చేసిన తప్పును క్యాష్ చేసుకోవాలని చూస్తారు. రాజ్ చేసిన తప్పును మీడియా ముందు బయట పడేలా చేసి.. అతని పరువు తీయాలనుకుంటారు. అలాగే రాజ్ ను ఎండీ సీట్ నుంచి తప్పించి రాహుల్ ను ఇంటి వారసుడిగా ప్రకటించేలా చేయాలనీ కుట్ర చేస్తారు.

publive-image

రాహుల్, రుద్రాణి ప్లాన్ మొత్తం వినేసిన స్వప్న.. అత్త, భర్తకు గడ్డి పెడుతుంది. సొంత ఇంటి పరువునే కూల్చేయాలనుకుంటున్నారా..? అలా జరిగితే ముందు రోడ్డున పడేది మీరే అని వార్నింగ్ ఇస్తుంది.

publive-image

మరో వైపు రాజ్ తనతో పాటు బాబును కూడా ఆఫీస్ కు తీసుకొని వెళ్తాడు. బాబును చూడగానే ఎంప్లాయిస్ అంతా ఆశ్చర్యంగా చూస్తారు. ఇంతలో శృతి అక్కడికి వస్తుంది. బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు. మీ బంధువుల బాబా సార్ అని రాజ్ ను అడుగుతుంది. దీంతో రాజ్ ఆమె పై సీరియస్ అవుతాడు. ముందు ఆఫీస్ లో చెప్పిన పని చేయి.. ఇలాంటి కాలు, చేతులు పెట్టకు అని శ్రుతికి వార్నింగ్ ఇస్తాడు.

publive-image

ఆ తర్వాత ఆఫీస్ లో అందరు రాజ్ తీసుకొచ్చిన బాబు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇది విన్న కావ్య వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది.

publive-image

పోలీస్ కావాలనుకున్న అప్పుకు నిరాశ ఎదురవుతుంది. ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాలని అడగడంతో డల్ గా ఇంటికి వస్తుంది. అప్పు ఇంటికి రాగానే.. కనకం ఏమైందని అడుగుతుంది. దీంతో నేను పోలీస్ అవ్వను.. నాకు ఏ ఉద్యోగం వద్దు అని కోపంగా వెళ్ళిపోతుంది.

publive-image
రాజ్ కోసం ఆఫీస్ కు వచ్చిన శ్వేత అక్కడ బాబును చూసి షాకవుతుంది. ఆ తర్వాత రాజ్..ఆ బాబు తన బిడ్డనే అని చెప్పడంతో నమ్మలేకపోతుంది. కావ్యకు ఇంత మోసం ఎలా చేశావు అని రాజ్ ను నిలదీస్తుంది. అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉందని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది.

publive-image
ఇందంతా చాటుగా విన్న కావ్య.. ఈ విషయం శ్వేతకు కూడా తెలియదా..? అని ఆశ్చర్యపోతుంది. అసలు ఆయన జీవితం ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Vijay Devarakonda: పెళ్లి పై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు