Brahmamudi Serial: అపర్ణ దెబ్బకు నోరు మూసుకున్న అనామిక.. బిజినెస్ లో రాజ్ కు ఊహించని ఎదురుదెబ్బ..!

రాజ్ నిర్లక్ష్యం కారణంగా బిజినెస్ లో కోటి రూపాయలు నష్టం రావడంతో అందరి ముందు పంచాయితీ పెడుతుంది ధాన్యలక్ష్మి. దీంతో ధాన్యలక్ష్మి పై ఫుల్ ఫైర్ అవుతుంది అపర్ణ. మరో వైపు బిడ్డను తీసుకొని ఆఫీస్ కు బయలుదేరుతాడు రాజ్. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial: అపర్ణ దెబ్బకు నోరు మూసుకున్న అనామిక.. బిజినెస్ లో  రాజ్ కు ఊహించని ఎదురుదెబ్బ..!
New Update

Brahmamudi Serial Today Episode: రాజ్ బాబుకు స్నానం చేయించాలని అనుకుంటాడు. కానీ ఎలా చేయించాలో తెలియక అయోమయంగా ఉంటాడు. దీంతో కావ్య స్నానం ఎలా చేయించాలో భర్తకు చెబుతుంది. కావ్య తన బాబుకు స్నానం చేయించడం చూసి రాజ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కావ్య మీ అమ్మగారు మనిద్దరిని ఇలా చూస్తే మనకు తలంటుతారు అని రాజ్ తో చెప్తుంది.

Brahmamudi Serial

మరో వైపు ప్రకాశంకు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. రాజ్ పట్టించుకోకపోవడం వల్ల బిజినెస్ లో కోటి రూపాయలు నష్టం వచ్చిందని తెలుస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా తానే హ్యాండిల్ చేయాలనీ అనుకుంటాడు. కానీ చాటుగా ఇది రుద్రానీ, అనామిక.. ఈ విషయం అందరి ముందు బయట పెట్టి రాజ్ పరువు తీయాలని ప్లాన్ చేస్తారు.

Brahmamudi Serial

రాజ్ ఇరికించాలని ప్లాన్ వేసిన అనామిక , రుద్రాణి ఆఫీస్ లో జరిగిన నష్టం గురించి ధాన్యలక్ష్మితో చెబుతారు. ఇంతలో ఇంటికి వచ్చిన సుభాష్.. ఆ కంపెనీ వాళ్లకు ఇచ్చిన ఆర్డర్ గురించి ప్రకాశాన్ని నిలదీస్తాడు.

publive-image

శుభాష్ తన భర్తను నిలదీయడంతో.. కోపంతో రగిలిపోయిన ధాన్యలక్ష్మి అసలు నిజం బయటపెడుతుంది. రాజ్ కారణంగానే ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని.. కోటి రూపాయలు నష్టం వచ్చిందని ఇంట్లో అందరి ముందు రాజ్ ను నిందిస్తుంది.

publive-image

ఇంతలో అక్కడికి వచ్చిన రాజ్.. తాను బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మొదటి సారి నష్టం వచ్చింది. కానీ ఎన్నో సార్లు లాభాలు వచ్చాయి . మరి దాని గురించి మాట్లాడారేంటి. ప్రతీ సారి ఇలా వేరు చేసి మాట్లాడతారు అని ధాన్యలక్ష్మి పై ఫైర్ అవుతాడు రాజ్.

Brahmamudi Serial

మరో వైపు అనామిక కూడా కోటి రూపాయల నష్టం గురించి ప్రశ్నింస్తుంది. దీంతో అనామిక పై అపర్ణ సీరియస్ అవుతుంది. నీ పుట్టింటి నుంచి ఏమైనా తీసుకొచ్చావా. నిన్న గాక మొన్న వచ్చావు కుక్కినపేనులా పడి ఉండు అని అనామిక దుమ్ము దులిపేస్తుంది.

publive-image

ఇంట్లో అందరి ముందు పరువు పోవడంతో రాజ్ పై సీరియస్ అవుతుంది అపర్ణ. పాలకుండలాంటి ఈ ఇంట్లో విషపు చుక్క పడింది అని మళ్ళీ రాజ్ తెచ్చిన బిడ్డ గురించి నిలదీస్తుంది. అందరు ఇలా మాట్లాడానికి కారణం నువ్వే అని రాజ్ పై కోపంగా వెళ్ళిపోతుంది.

publive-image

మరో వైపు అప్పు పోలీస్ ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అవుతుంది. కానీ జాబ్ కావాలంటే లంచం ఇవ్వాలని భయపెడతాడు బ్రోకర్. దీంతో అప్పు తనతో వాదనకు దిగుతుంది.

publive-image

రాజ్ బిడ్డతో పాటు ఆఫీస్ కు వెళ్లాలని అనుకుంటాడు. ఇది చూసిన కావ్య ఇలా బాబును తీసుకెళ్తే ఆఫీస్ లో మీ పరువు పోతుంది అని చెప్తుంది. కానీ రాజ్ మాత్రం తన గురించి ఏమనుకున్నా పర్వాలేదని బాబును తీసుకెళ్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi Serial

Also Read: Siddharth Roy Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్దార్థ్ రాయ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

#brahmamudi-serial #brahmamudi-serial-today-episode
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe