Siddharth Roy Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్దార్థ్ రాయ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? యంగ్ హీరో దీపక్ సరోజ, హీరోయిన్ తన్వి నేగి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం సిద్దార్థ్ రాయ్. రీసెంట్ గా థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మార్చి 29 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ లో కానున్నట్లు సమాచారం. By Archana 27 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Siddharth Roy Movie: 'అతడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులరైన దీపక్ సరోజ్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం సిద్దార్థ్ రాయ్. ఫస్ట్ లుక్ , పోస్టర్, టీజర్ తో రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అర్జున్ రెడ్డి 2.0 లా ఉండబోతుందని భావించారు. కానీ ఫిబ్రవరి 23న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. వారం రోజుల పాటు థియేటర్స్ బాగానే ఆడినప్పటికీ .. ఆ తర్వాత పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది. Also Read: Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ కి సినీ ప్రపంచం గ్రాండ్ విషెస్.. బర్త్ డే ట్వీట్స్ వైరల్ సిద్దార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే అఫిషియల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వెలువడనున్నాయి. ఈ సినిమాలో దీపక్ సరోజ్ సరసన యంగ్ బ్యూటీ తన్వి నేగి కథానాయికగా నటించింది. కల్యాణి ఎన్, మాథ్యూ వర్గీస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన యశస్వీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అంతే కాదు సిద్దార్థ్ రాయ్ మూవీతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. Also Read: Music Director Thaman: రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ పాటను ఎత్తేసిన తమన్.. వైరలవుతున్న ట్రోల్స్..! #siddarth-roy-movie #siddarth-roy-movie-ott #deepak-saroj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి