Brahmamudi Serial : విడాకులకు సిద్దమైన రాజ్.. బెడిసికొట్టిన ఇందిరాదేవి ప్లాన్.. ముక్కలైన కావ్య జీవితం..! కావ్య విడాకులు అడగడంతో అయోమయంలో పడతాడు రాజ్. మరో వైపు కావ్య మనసు ముక్కలు చేశావని రాజ్ ను తిడుతుంది శ్వేత. వెంటనే వెళ్లి తనలోని ప్రేమను బయటపెట్టమని రాజ్ కు సలహా ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 16 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Serial Today Episode : రాజ్(Raj) కు విడాకుల పేపర్స్(Divorce Papers) ఇచ్చేసిన కావ్య(Kavya).. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పండి అని భర్తకు చెప్తుంది. భార్య, భర్త(Wife & Husband) ల మధ్య ఉండాల్సిన ప్రేమ మనిద్దరి మధ్య లేదు. అందరికీ కూడా ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మీరు మారుతారని వెయిట్ చేశాను. కానీ నమ్మకం పోయింది. అందుకే విడాకులు కావాలని కోరుకుంటున్నాను. సాయంత్రం లోగా మీ నిర్ణయం చెప్పండని భర్త రాజ్ కు చెప్పేసి వెళ్ళిపోతుంది కావ్య. అసలు భర్తకు విడాకులు ఇవ్వడమే ఇష్టం లేని కావ్య.. రాజ్ తో ఆమె మాట్లాడిన మాటలను తలుచుకొని కనీళ్ళు పెట్టుకుంటుంది. తన భర్త ప్రేమను పొందడానికి చేసే ఈ విడాకుల ప్రయత్నం ఫలించాలని.. తన భర్తతో ఎప్పటికీ కలిసుండాలని కోరుకుంటుంది. కావ్య విడాకులు అడగడంతో అయోమయంలో పడిపోతాడు రాజ్. ఇంతలో రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి.. ప్రాణంగా ప్రేమించే భార్య వదిలేసి వెళ్లిపోయేలా చేశావు. తన మనసును ముక్కలు చేశావు అని తిడుతుంది. దీంతో రాజ్ కోపంగా విడాకుల పేపర్స్ విసిరేసి వెళ్ళిపోతాడు. కావ్య కిందకు రాగానే.. రాజ్ ఏమ్మన్నాడని అడుగుతుంది ఇందిరాదేవి(Indira Devi). ఆయన సైలెంట్ గా ఉన్నారు ఏం మాట్లాడలేదు అని చెప్తుంది కావ్య. దీంతో దిమ్మ తిరిగుంటుంది వెధవకి అని ఇందిరాదేవి అంటుంది. కానీ కావ్య మాత్రం ఈగోకు పోయి రాజ్ ఎక్కడ విడాకులు ఇస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ కూడా కిందకి వస్తాడు. రాజ్ ఆఫీస్ కు వెళ్తుండగా.. టిఫిన్ చేసి వెళ్ళమని చెప్తుంది అపర్ణాదేవి(Aparna Devi). విడాకుల విషయం గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటాడు. అందరూ ఏమైందని అడిగితే.. తలనొప్పి అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. ఇంటి నుంచి ఫ్రెండ్ శ్వేతా(Swetha) దగ్గరకు వచ్చిన రాజ్ తనతో విడాకుల విషయం గురించి చెప్తాడు. దీంతో శ్వేత.. కావ్య మానసికంగా ఎంతలా నలిగిపోయి ఉంటే ఈ నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి నన్ను అడ్డుపెట్టుకొని అనుకున్నది సాదించావు కదా.. ఇక కావ్య నీ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని రాజ్ ను తిడుతుంది కావ్య. శ్వేతా ఎంత మాట్లాడిన రాజ్ మౌనంగా ఉండిపోతాడు. దీంతో శ్వేతా.. ఇది మౌనం కాదు రాజ్.. కావ్య నీ నుంచి వెళ్లిపోతుందన్న ఊహ తట్టుకోలేక నీ మెదడు ఆగిపోయింది. ఈ శూన్యం నువ్వు తట్టుకోలేవు.. పిచ్చివాడైపోతావు. ఇప్పుడైనా వెళ్లి కావ్యకు నీ ప్రేమను చెప్పు అంటూ రాజ్ కు సలహా ఇస్తుంది. మరో వైపు అనామిక ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. దీంతో అనామిక ఇంట్లో వాళ్లందరినీ తన ఫ్రెండ్ కు పరిచయం చేస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. Also Read : Pop Singer Ed Sheeran : RRR మూవీ పై పాప్ సింగర్ ఎడ్ షీరన్ ప్రశంసలు.. వైరలవుతున్న వీడియో #brahmamudi-serial #brahmamudi-serial-today-episode #daily-serial #tv-serial మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి