Brahmamudi: కళ్యాణ్, అప్పు పరువు తీసేందుకు అనామిక చేసిన కుట్రను కళ్యాణ్ బయటపెడతాడు. ఇంటి పరువు తీసిన అనామికను ఇంట్లో అందరు అసహ్యించుకుంటారు. ఇక తన కొడుకు పై ఇలాంటి నింద వేసినందుకు అనామిక చెంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మీ. ఇన్నాళ్లు నువ్వెన్ని త్పపులు చేసిన నా కొడుకును మందలించాను. నిన్నే వెనుకేసుకొచ్చాను. కానీ నువ్వు ఈ లోకం దృష్టిలో నా కొడుకును చెడ్డవాడిగా నిలబెట్టావు అని కోడలు అనామిక పై కోప్పడుతుంది.
ఇక స్వప్న కూడా అనామిక పై మండిపడుతుంది. తన చెల్లి అప్పు పరువు తీసిందని ఆమెను కొట్టబోతుంది. ఇంతలో కావ్య అడ్డుకుంటుంది. కొట్టడం ఎంతసేపు. చేయి గాల్లోకి లేచినంత సేపు పట్టదు. కానీ ఇది భార్య, భర్తల విషయం. దీని వల్ల కళ్యాణ్ కాపురం ముక్కలవకూడదు అని స్వప్నకు సర్ది చెబుతుంది. ఆ తర్వాత అనామికను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇస్తుంది స్వప్న.
అనామిక వెళ్ళిపోగానే కళ్యాణ్ ఇంట్లో వాళ్లకు తన మనసులోని మాటను చెప్తాడు. తన చెల్లికి అన్యాయం జరిగిన నా కాపురం బాగుండాలని కోరుకునే వదిన, చుట్టూ నా మంచి కోరే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మంచి మనుషుల మధ్య అలాంటి ఆడది ఉండకూడదు. అనామిక కేవలం ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. నన్ను బజారున పడేసింది. ఇక నేను సహించలేను అనామికకు విడాకులు ఇస్తానని చెప్తాడు కళ్యాణ్. దీంతో అందరు షాకవుతారు.
మరో వైపు తమ్ముడి జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు కళ్యాణ్. ఇంతలో అక్కడి వచ్చిన కావ్య రాజ్ కు దైర్యం చెప్తుంది. ఎలాగైనా అనామిక, కళ్యాణ్ ను కలపాలి అని చెప్తుంది. సొంత చెల్లికి అన్యాయం చేసిన అనామిక మేలు కోసం ఆలోచిస్తున్న కావ్యను చూసి రాజ్ గర్వపడతాడు. భార్యను మెచ్చుకుంటాడు.
ఆ తర్వాత రాజ్ అనామిక దగ్గరకు వెళ్లి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. భార్యాభర్తలు మధ్య గొడవలు మాములే. కానీ ఇలా దూరం అయ్యేదాకా తెచ్చుకోవద్దు . మీరిద్దరూ కలిసి ఉంటేనే మాకు సంతోషం అని సర్ది చెప్తాడు.
రాజ్ మాటలు విన్న అనామిక కాస్త ఆలోచనలో పడుతుంది. ఇదంతా చాటుగా విన్న రుద్రాణి మళ్ళీ అనామికను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అనామిక , కళ్యాణ్ ను దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది.
ఇక భార్య ప్రవర్తనకు విసిగిపోయిన కళ్యాణ్ చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటాడు. ఇంతలో కావ్య అక్కడి వస్తుంది. ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ల తప్పులను కూడా క్షమించాలి. లేదంటే ప్రేమ లేదని తప్పుకోవాలి. అప్పుతో స్నేహం అనామికకు నచ్చదు. అలాంటప్పుడు అనామికకు నచ్చినట్లు ఉండండి. ఒకసారి తన వైపు నుంచి కూడా ఆలోచించండి అని కళ్యాణ్ కు సర్ది చెప్తుంది.
అనామిక చేసింది తప్పే. కానీ ఇలా కారణాలు చూపించి ఒంటరిగా మిగిలిపోకండి. ఒకమెట్టు దిగి రండి మీరు కోరుకున్న ప్రేమ మళ్లీ దక్కుతుంది. ఇప్పుడు నాతో పాటు వచ్చి మీరే అనామికను కన్విన్స్ చేస్తున్నారు అని కల్యాణ్‌ను తీసుకెళ్తుంది కావ్య.
ఇక వదిన మాటలను గౌరవించిన కళ్యాణ్ భార్య అనామికను సర్ది చెప్పాలని కిందకు వస్తాడు. కానీ రుద్రాణి మాయలో పడిన అనామిక మళ్ళీ రచ్చ చేస్తుంది. దీంతో కావ్య.. ఇదే నా చెల్లి అయితే మొహం పగులగొట్టేదాన్ని అని అంటుంది.
ఇక అనామిక.. నీ చెల్లెలు నాలా గుట్టుగా ఎందుకు ఉంటుంది. పరాయి మగాడితో, అది పెళ్లయిన వాడితో బలాదూర్ తిరుగుతుంది అని అప్పును ఘోరంగా అవమానిస్తుంది. దీంతో విసిగిపోయిన కళ్యాణ్ అనామిక పై చేయెత్తుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.