Brahmamudi Serial Today Episode: మాయను రాజ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లు సంతకం చేయడం ఇందిరాదేవికి నచ్చదు. దీంతో కావ్య పై కోపం చూపిస్తుంది. నీ దారి నువ్వు చూసుకున్నావు అని అర్థమైంది. ఇన్నాళ్లు చెడు వ్యసనాలు అంటే మందు తాగడం, చెడు సావాసం అనుకున్నాను. కానీ ఒక మనిషి పై నమ్మకం పెట్టుకోవడం కూడా వ్యసనమే అని కావ్య పై కోప్పడుతుంది.
మరో వైపు అసలు మాయను కనిపెట్టడానికి అడ్రెస్ వెతుకుంటూ వెళ్తుంది అప్పు. ఆ ఇంటికి వెళ్లి చూడగానే అక్కడ మాయ ఫ్రెండ్ ఉంటుంది. ఆమెను మాయ గురించి అడుగుతుంది. దాంతో ఆ అమ్మాయి మాయ ఇంట్లో లేదు ఊరెళ్ళింది రేపు వస్తుంది అని చెప్తుంది. ఇక మాయ వస్తే తనకు తెలియజేమని ఆ అమ్మాయికి తన నెంబర్ ఇచ్చేసి వెళ్తుంది అప్పు.
ఇందిరాదేవి తనను అపార్థం చేసుకువడంతో కావ్య ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మాయ అడ్రెస్స్ దొరికిందని కాల్ చేస్తుంది అప్పు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన రుద్రాణి, మాయ.. అసలు మాయను పట్టుకుంటాను.. నిజం బయటపెడతాను అని కబుర్లు చెప్పావు చివరికి ఏమైంది అని కావ్యతో వెటకారంగా మాట్లాడతారు.
మరో వైపు రాజ్ గదిలో పడుకునేందుకు కొత్త డ్రామా మొదలుపెడుతుంది మాయ. దాని కోసం ఇంట్లో అందరి ముందు పంచాయతీ పెడుతుంది. నేను నా బిడ్డతో ఉంటున్నాను. కానీ నా బిడ్డ రాజ్‌కు అలవాటు పడ్డాడు. వాడు లేకుంటే నేను దిగులు పెట్టుకుంటాను. నేను నా బిడ్డతో పాటే రాజ్ గదిలో ఉంటానని నటిస్తుంది.
మాయ ఇలా చెప్పడంతో ఇందిరాదేవి కోప్పడుతుంది. ఇన్నాళ్లు ఏమైంది నీ తల్లి ప్రేమ. ఇంకోసారి రాజ్ గదిలో ఉంటానంటే పళ్ళు రాలగొడతానని మాయకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతూ.. అపర్ణను అత్తయ్య అని పిలుస్తుంది. దీంతో అపర్ణ షాకవుతుంది.
నాలుక చీరేస్తా.. నువ్వంటే నాకు పరమ అసహ్యం. ఇంటి పరువు కోసం మాత్రమే పెళ్ళికి ఒప్పుకున్నాను. నువ్వు చచ్చేదాక నన్ను అత్తయ్య అని పిలవకు అని మాయకు పెద్ద షాకిస్తుంది.
ఆ తర్వాత అనామిక కళ్యాణ్ తో మాయ గురించి మాట్లాడుతుంది. మీ అన్నయ చేసిన తప్పుకు అందరు మాయను అవమానిస్తున్నారు. బావ గారి గదిలో ఉండే అర్హత మాయకు మాత్రమే ఉంది అని అంటుంది. దీంతో కళ్యాణ్.. మరి మా వదినకు, అని అనామికతో వాదిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Music Shop Murthy: ఎమోషనల్ గా 'మ్యూజిక్‌షాప్' మూర్తి ట్రైలర్.. వెంటనే చూసేయండి..! - Rtvlive.com