Brahmamudi: ఇంట్లో మళ్ళీ అప్పు గురించి పంచాయతీ.. ధాన్యలక్ష్మికి కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ..!

భార్య అనామిక చేసిన ద్రోహాన్ని తలుచుకొని కళ్యాణ్ బాధపడుతుంటాడు. మరో వైపు ధాన్యలక్ష్మి అప్పు వల్లే కళ్యాణ్ జీవితం ఇలా అయ్యిందని నిందిస్తుంది. దాంతో కళ్యాణ్ తల్లి ధాన్యలక్ష్మి పై కోప్పడతాడు. అప్పు ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తాడు. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.

Brahmamudi: ఇంట్లో మళ్ళీ అప్పు గురించి పంచాయతీ.. ధాన్యలక్ష్మికి కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ..!
New Update

Brahmamudi: కోర్టులో అనామిక చేసిన ఆరోపణలు, మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని కుమిలిపోతుంటాడు కళ్యాణ్. భార్య తన పై వేసిన నిందలు కల్యాణ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ బాధను తట్టుకోలేకపోయిన కళ్యాణ్ అనామిక జ్ఞాపకాలను శాశ్వతంగా దూరం చేసుకోవాలని అనుకుంటాడు. వారిద్దరి పెళ్లి ఫొటోలు, అనామిక ఫొటోలను బయటకు తీసి కాల్చేస్తాడు.

publive-image

ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య కళ్యాణ్ ను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఫోటోలు కాలిపోవడం చూసి మంచి పని చేశారని అంటుంది. లేదంటే ఈ ఫోటోలు చూసిన ప్రతి సారి అనామిక చేసిన అన్యాయమే గుర్తుకువచ్చి బాధపడతారు అని మరిదికి దైర్యం చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ను భోజనానికి తీసుకెళ్తుంది.

publive-image

ఇక కళ్యాణ్ భోజనానికి రాగానే అప్పు టాపిక్ తీసి మళ్ళీ పెద్ద గొడవకు కారణమవుతుంది రుద్రాణి. కళ్యాణ్ బాధ అనామిక దూరమైనందుకు కాదు, తను మూలంగా అప్పుకు నష్టం జరిగిందని అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ కూడా ఇంకా అప్పు గురించే ఆలోచిస్తున్నావా అని కళ్యాణ్ అడుగుతుంది.

publive-image

ధాన్యలక్ష్మి మాటలకు విసిగిపోయిన కళ్యాణ్.. అవును అప్పు గురించే ఆలోచిస్తున్నాను తప్పేంటి అని అంటాడు. దాంతో ఇంట్లో అందరు షాకవుతారు. ఇక ధాన్యలక్ష్మి రెచ్చిపోతుంది. ఇంకా ఆ దరిద్రం గురించి ఎందుకురా నీకు అని కొడుకు పై కోప్పడుతుంది. దానికి కళ్యాణ్.. ఇన్నాళ్లు అనామిక ఇలాగే అని వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావా..? అసలు నీ వల్లే నా కాపురం నాశనం అయ్యింది. మొదటి నుంచి అనామిక నువ్వు బుద్ది చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ధాన్యలక్ష్మి పై ఫైర్ అవుతాడు.

publive-image

కళ్యాణ్ భోజనం చేయకుండా కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరకు వెళ్లిన కావ్య అతనికి దైర్యం చెప్తుంది. ఆవేశ పడకు కళ్యాణ్ అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ జరిగింది తలుచుకుంటుంటే నా గుండె మండిపోతుంది. అసలు ఈ విషయంలో అప్పు తప్పేమి లేదు. మా అమ్మ ఇంకా అప్పుదే తప్పని ఎందుకు అంటుంది అని బాధపడతాడు.

publive-image

ఇక కావ్య మీరిద్దరూ ఎలాంటి తప్పు చేయలేదని కోర్టులో సాక్ష్యాలతో సహా బయటపడింది కదా. అప్పు అందరిలాంటి ఆడపిల్ల కాదు. తన తప్పు లేకుంటే తల వంచదు. మీరు ఇంకా దాని గురించి బాధపడకండి అని కళ్యాణ్ ను కూల్ చేస్తుంది.

publive-image

ఆ తర్వాత కావ్య తన గదిలోకి వెళ్తుంది. కావ్య రాగానే కళ్యాణ్ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు రాజ్. చాలా కోపంగా ఉన్నాడు. అనవసరంగా ఆ రుద్రాణి తన మనసును బాధపెట్టింది అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Ambani Wedding : గ్రాండ్ గా అనంత్ - రాధికా హల్దీ వేడుకలు.. బాలీవుడ్ సెలెబ్రెటీల సందడి..! - Rtvlive.com

#brahmamudi-serial #brahmamudi-today-episode
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe