Brahmamudi Today Episode : కళ్యాణ్ (Kalyan) పై తప్పుడు ఆరోపణలు చేసిన అనామిక (Anamika) ను దిమ్మతిరిగే షాకిస్తుంది కావ్య (Kavya). కోర్టులో జడ్జ్ ముందు అనామిక నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. అనామిక చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా కోర్టు ముందు కావ్య నిరూపిస్తుంది. అనామికను కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడిన మాటలన్నీ చాటుగా డ్రైవర్ ద్వారా రికార్డ్ చేయిస్తుంది కావ్య.
ఆస్తి కోసం మాత్రమే కళ్యాణ్ పెళ్లి చేసుకున్నానని. లగ్జరియస్‌గా బతకడం కోసమే తెలివిగా కళ్యాణ్‌ను ఈ కేసులో ఇరికించానని కావ్యతో అంటుంది అనామిక. ఈ వీడియోను కావ్య జడ్జ్ ముందు బయటపెడుతుంది. దీంతో అనామిక నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది.
భర్త కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అనామికకు కోర్టు కఠిన శిక్ష విదిస్తుంది. తప్పుడు ఆరోపణలతో కళ్యాణ్, అతని కుటుంబాన్ని అల్లరి పాలు చేసినందుకు పరువు నష్టం కింద 2 లక్షలు పరిహారం చెల్లించాలని. అలాగే అప్పు శీలంపై నింద వేసినందుకు పరువునష్టం క్రింద ఆమె కుటుంబానికి లక్ష రూపాయలు చెల్లించాలని తీర్పును ఇస్తుంది.
ఇక కోర్టులో అనామికకు వ్యతరేకంగా తీర్పు రావడంతో షాకవుతుంది. ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య అనామికకు గడ్డి పెడుతుంది. అహంకారంతో నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. ఇప్పుడేం జరిగిందో చూసావు కదా. ఇక నుంచైనా మంచిగా ఉండడమని అనామికకు చెప్తుంది.
మరో వైపు అనామిక తప్పుడు ఆరోపణలను నిజమని నమ్మి ఆమెకు సహాయం చేసిన మహిళా సంఘం వారు కూడా అనామిక నిజస్వరూపం తెలిసిన తర్వాత ఫైర్ అవుతారు. నీ మాటలు విని మంచి ఫ్యామిలీని అవమానించాము. నీలాంటి వాళ్ల వల్ల మాకు చెడ్డపేరు వస్తుంది అని అనామిక పై కోప్పడతారు.
కళ్యాణ్ నిర్దోషి అని నిరూపణ కావడంతో ధాన్యలక్ష్మి, ప్రకాశం, రాజ్ ఆనందపడతారు. బలం, బలగం, డబ్బు ఉన్నా మేము ఏం చేయలేకపోయాము. కానీ నువ్వు మాత్రం కళ్యాణ్ ని కాపాడి.. వదిన అంటే తల్లికి తక్కువేం కాదని నిరూపించావు అని కావ్యను మెచ్చుకుంటాడు ప్రకాశం.
మరో వైపు రాజ్ గది బయట నిల్చొని కావ్యను చూస్తూ ఉంటాడు. తనకు ఐ లవ్ యు చెప్పినట్లు కలలు కంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఇందిరాదేవి ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు. కావ్యతో నీ ప్రేమ విషయాన్ని బయటపెట్టు అని చెప్తుంది.