Brahmamudi Serial: కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్..కావ్యను చీరతో కట్టి రాజ్ ఏం చేశాడంటే?

బ్రహ్మముడి సీరియల్‌లో ఇందిరాదేవి ఇచ్చిన సలహాతో రాజ్, శ్వేత సంబంధం ఏంటో తెలుసుకునేందుకు కల్యాణ్‌తో కలిసి కావ్య సీక్రెట్ ప్లాన్ చేస్తుంది. రాజ్ వాట్సాప్ చాటింగ్ చూద్దామని కళ్యాణ్ ప్లాన్ చేస్తాడు. మరోవైపు కళ్యాణ్ కు అధికారం ఇవ్వాలని అపర్ణతో ధాన్యలక్ష్మీ గొడవకు దిగుతుంది.

New Update
Brahmamudi Serial: కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్..కావ్యను చీరతో కట్టి రాజ్ ఏం చేశాడంటే?

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్‌లో భర్త రాజ్ (Raj) గురించి ఆలోచిస్తూ భార్య కావ్య ఫుడ్ తినకుండా పడుకుంటుంది. అది గమనించిన రాజ్ కావ్య కోసం ఫుడ్ తీసుకొస్తాడు. తనకు ఆకలిగా లేదని బాధతో కడుపు నిండిపోయిందని అలిగి ఉంటుంది. నువు ఇలా చెప్తే ఎలా తింటావే అని కావ్య చీరతోనే ఆమె చేతులు కట్టేసి బలవంతంగా తనకు ఫుడ్ తినిపిస్తాడు. ఆ తరువాత టాబ్లెట్ కూడా వేస్తాడు. ఇప్పుడు ప్రశాంతంగా అలిగి పడుకో అని అంటాడు. ఇంతలో శ్వేత (Swetha) కాల్ చేయడంతో రాజ్ వెళ్లిపోతాడు.

Brahmamudi Serial

ఇందిరాదేవి సలహా..

కావ్య తను బాధను చెప్పుకోవడానికి తనకు ఎంతో ఇష్టమైన కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్తుంది. తన మనుసులో బాధను దేవుడితో పంచుకుంటుంది. ఇంతలో ఇంటి పెద్ద ఇందిరాదేవి వస్తుంది. తన స్నేహితురాలికి ఆమె భర్తపై వచ్చిన అనుమానం గురించి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఇన్ డైరెక్ట్ గా తన గురించి చెబుతూ అడుగుతుంది. ఇందిరాదేవి ఇచ్చిన సలహాతో రాజ్ కు శ్వేత కు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకునేందుకు కల్యాణ్‌తో కలిసి కావ్య ప్లాన్ చేస్తుంది.

publive-image

కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్

మరోవైపు రాజ్ తన ఫోన్ లో శ్వేతతో చాటింగ్ చేస్తూ మురిసిపోతుంటాడు. అప్పుడే కావ్య, కల్యాణ్ (Kalyan) డోర్ పక్కన నిలబడి అతడిని చూస్తుంటారు. రాజ్ స్నానానికి వెళ్లగా అతని వాట్సాప్ చాటింగ్ చూద్దామని కళ్యాణ్ ప్లాన్ చేస్తాడు. కానీ కావ్య అందుకు ఒప్పుకోదు. కానీ, కళ్యాణ్ తన అన్న ఫోన్ తీసుకుని చాటింగ్  చూసి షాక్ అవుతాడు. మరోవైపు కళ్యాణ్ కు అధికారం ఇవ్వాలని అపర్ణతో ధాన్యలక్ష్మీ గొడవకు దిగుతుంది.

publive-image

Also Read: దేవర మూవీ రిలీజ్ వాయిదాలో నిజమెంత?

Advertisment
Advertisment
తాజా కథనాలు