Brahmamudi Serial: అపర్ణకు ఇందిరాదేవి స్ట్రాంగ్ వార్నింగ్.. కళ్యాణ్ కోసం అనామిక ఎత్తుగడలు..! ధాన్యలక్ష్మి, రుద్రాణి మాటలకు తట్టుకోలేకపోయిన అపర్ణ ఆ కోపాన్ని కోడలు కావ్య పై చూపిస్తుంది. ఆమెను పుట్టింటికి వెళ్లిపొమ్మని నానా మాటలు అంటుంది. కావ్యను ఇలా అనడం గమనించిన ఇందిరాదేవి కోడలు అపర్ణకు గట్టిగా క్లాస్ ఇస్తుంది. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ సాగుతోంది. By Archana 11 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi Serial: బిడ్డ తల్లి వెన్నెలను కనిపెట్టడానికి.. రాజ్ తో పాటు చదువుకున్న బ్యాచ్ కు రీ యూనియన్ ఆరెంజ్ చేయాలని ప్లాన్ వేస్తుంది కావ్య. ఇది అమలు చేయడానికి శ్వేత హెల్ప్ తీసుకుంటుంది . శ్వేతా కూడా దానికి ఒప్పుకోవడంతో ఆమెకు థ్యాంక్స్ చెప్తుంది కావ్య. ఆ తర్వాత శ్వేత .. రాజ్ మాటలు విని తనను ఏడిపించినందుకు సారీ అని చెప్తుంది. మరో వైపు బిడ్డ విషయంలో రుద్రాణి, ధాన్యలక్ష్మి సూటి పోటీ మాటలు అంటూ ఎగతాళి చేయడంతో అపర్ణ ఫీల్ అవుతుంది. భర్త సుభాష్ దగ్గరకు వచ్చి.. తనకు ఇంట్లో ఉండాలని లేదు అని చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత శ్వేతను కలిసిన కావ్య ఇంటికి వస్తుంది. మనవరాలు ఇంటికి రాగానే వెళ్లిన పని ఏమైంది అని అడుగుతుంది ఇందిరాదేవి. దాంతో కావ్య వెన్నెల అడ్రెస్స్ దొరకలేదు.. అందుకే స్కూల్ రీ యూనియన్ ప్లాన్ చేశాము. అలాగైనా ఆ వెన్నెల ఎవరో కనిపెట్టచ్చు అని చెప్తుంది. ఇక ఇందిరాదేవి రుద్రాణి, ధాన్యలక్ష్మి అపర్ణకు చేసిన అవమానం గురించి కావ్యకు చెప్తుంది. మరో వైపు అపర్ణ తల పట్టుకొని కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య అత్త కోసం కాఫీ తీసుకొని వస్తుంది. ఇక అప్పటికే ధాన్యలక్ష్మి, రుద్రాణి మాటలకు కోపంతో రగిలిపోతున్న అపర్ణ ఆ కోపాన్ని అంత కోడలు కావ్య పై చూపిస్తుంది. తలనొప్పికి కాఫీ ఇస్తే సరిపోతుంది.. మరి ఇంటికి పట్టిన అరిష్టం పోతుంది. నువ్వొక నష్టజాతకురాలివి .. నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే ఉమ్మడిగా ఉన్న కుటుంబం ముక్కలైంది. నువ్ అంటే ఇష్టం లేక నా కొడుకు పక్కదారి పట్టాడు. నీకు అన్యాయం జరిగింది కదా.. ఇంకా ఈ ఇంటిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు వెళ్ళిపో అని కావ్యను నానా మాటలు అంటుంది అత్త అపర్ణ. ఇదంతా విన్న ఇందిరాదేవి కోడలు అపర్ణను కడిగిపారేస్తుంది. నీ తోడి కోడలు, ఆడపడుచుకు మాటలకు సమాధానం చెప్పలేక.. నీ కొడుకుని నిలదీయలేక.. ఏమనదులే, ఎదురుతిరగదులే అని కావ్యను ఇన్ని మాటలు అంటున్నావా. ఎక్కడికిపోయింది నీ వివేకం అని కోడలి దుమ్ముదులిపేస్తుంది ఇందిరాదేవి. మరో వైపు భర్త ఎండీ కావలి అనే తన కోరికను నెరవేర్చుకున్న అనామిక.. ఇక కళ్యాణ్ మెల్లిగా తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇప్పటి నుంచి భర్తతో ప్రేమగా ఉండాలని అనుకుంటుంది. తల్లి అపర్ణ కావ్యను అవమానించడం గమనించిన రాజ్.. భార్యను పుట్టింటికి వెళ్లిపొమ్మని చెప్తాడు. నేను మంచి వ్యక్తిని కాదు, మంచి భర్తను కూడా కాదు. ఇంకా నీకు ఈ అవమానాలన్ని ఎందుకు వెళ్ళిపో అని అంటాడు. దానికి కావ్య సరే అంటుంది. దీంతో రాజ్ షాకవుతాడు. వెంటనే కావ్య.. ఏంటీ ఇంత ఈజీగా ఒప్పుకున్నాను అనుకుంటున్నారా..? నేను మా పుట్టింటికి వెళ్తాను కానీ ఇప్పుడు కాదు అసలు నిజం బయట పడిన తర్వాత అని చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. Also Read: NTR Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.. కరణ్ చేతికి ‘దేవర’ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ #brahmamudi-serial #brahmamudi-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి