స్కూల్ బస్సు కింద పడి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో చోటు చేసుకుంది. శివాన్షు(3) తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లిపాటు వెళ్లాడు. మృతుడి తల్లి తన పెద్ద కుమారుడ్ని బస్సు ఎక్కించే పనిలో ఉండగా.. చిన్న కుమారుడు ఆడుకుంటూ బస్సు ముందువైపు వెళ్లాడు. బస్సు ముందు బాలుడు ఉండటాన్ని గమనించని స్కూల్ బస్సు డ్రైవర్.. బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలుడ్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో శివాన్షు తీవ్ర గాయాల పాలయ్యాడు.
పూర్తిగా చదవండి..స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని చంటేయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందాడు. ఆన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించడానికి తల్లితోపాటు వచ్చిన బాలుడు ఆడుకుంటూ బస్సు ముందుకు వెళ్లాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా వెళ్లడంతో బస్సుక్రింద పడ్డ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Translate this News: