Bottle Gourd : యువకుడి కడుపులో సోరకాయ.. చివరికి

మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయను వైద్యులు బయటకు తీశారు. ఈ సోరకాయ వల్ల ఆ యువకుడి పేద్దపేగు నలిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. శరీరంలో మలద్వారం ద్వారా ఇది వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

New Update
Bottle Gourd : యువకుడి కడుపులో సోరకాయ.. చివరికి

Madhya Pradesh : ప్రమాదవశాత్తు ఎవరైనా ఏదైన వస్తువులు మింగినప్పుడు వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీస్తారు. అయితే తాజాగా ఓ యువకుడి కడుపులో నుంచి ఏకంగా అడుగుకు పైగా పొడవున్న సోరకాయ (Bottle Gourd) ను బయటకు తీశారు. మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పుర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖజురహో ప్రాంతానికి చెందిన యువకుడు తీవ్రమైన కడుపునొప్పి (Stomach Ache) తో ఛతర్‌పుర్ జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడికి పరీక్షలు చేశారు. ఎక్స్‌ రే తీయగా కడుపులో ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించారు.

Also read: భారీ వర్షాలు.. రామప్ప ఆలయంలో వర్షపు నీరు లీక్

శనివారం ఆ యువకుడికి వైద్య బృందం శస్త్రచికిత్స చేయడం ప్రారంభించింది. అయితే అతడి పొట్టలో తోడిమతో కూడిన సోరకాయ చూసి వైద్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. చివరికి దాన్ని విజయవంతంగా బయటకు తీశారు. ఈ సోరకాయ వల్ల ఆ యువకుడి పేద్దపేగు నలిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. శరీరంలో మలద్వారం ద్వారా వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అతడికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా లేదా ఇంకేమైనా జరిగిందా అనే విషయం అతడికి స్పృహ వచ్చాక తెలుస్తుందని చెప్పారు.

Also Read: మన దేశ బడ్జెట్ ఎలా సిద్ధం చేస్తారో తెలుసా? ఆర్ధిక మంత్రి అన్ని నిర్ణయాలూ తీసుకుంటారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు