Minister Botsa : వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన మంత్రి బొత్స.. మా పార్టీ విధానం ఇదే..!

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు మంత్రి బొత్స. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. విభజన హామీల సాధనే మా పార్టీ విధానమన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని కామెంట్స్ చేశారు.

Bosta: ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంపై బొత్స ఎమన్నారంటే?
New Update

Capital Issue: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ ను మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితేనే బాగుంటుందని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యాలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.

తెలంగాణ జోలికి రావొద్దు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి పదేళ్లు కావస్తోందని.. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని.. మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందండి.. కానీ, మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ హాస్యాస్పదమన్నారు. ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు.

Also Read: ఏపీ రాజకీయాల్లోకి కొత్త నేతలు రాక.. మంత్రి విడదల రజినీకు ధీటుగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!


విభజన హామీల సాధనే..

ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana).హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కొనసాగించాలనేది మా విధానం కాదన్నారు. విభజన హామీల సాధనే మా పార్టీ విధానమన్నారు. ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కూడా కాదని చెప్పుకొచ్చారు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం? అంటూ ప్రశ్నించారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరంటూ వ్యాఖ్యానించారు.

వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా?

కాగా, 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తి కావొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్‌తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల ఇష్యూ నడుస్తున్న ఈ సమయంలో.. సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరగనుంది అని ఉత్కంఠ నెలకొంది.

#andhra-pradesh #botsa-satyanarayana #yv-subba-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe