Bonda Uma: హిందూవులపై దాడి చేస్తే ఊరుకోం.. వైసీపీకి బోండా ఉమా హెచ్చరిక

సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో హిందూ ధర్మం అంటే గౌరవం లేదని విమర్శించారు. వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని.. ప్రజల డేటాను విదేశాలకు అమ్ముకోవాలనేదే జగన్ కుట్ర అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో హిందూ ధర్మం నియమాలు పాటించకుండా ఉన్నారని దుయ్యబట్టారు.

New Update
Bonda Uma: హిందూవులపై దాడి చేస్తే ఊరుకోం.. వైసీపీకి బోండా ఉమా హెచ్చరిక

Bonda Uma warns YCP: వైసీపీపై విజయవాడ సెంట్రల్‌లో బోండా ఉమా సంచలన కామెంట్స్ చేశారు. రాష్టంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ ధర్మం అంటే గౌరవం లేదని మండిపడ్డారు. హిందూ ధర్మం నియమాలు పాటించకుండా ఉన్నారని.. 150 దేవాలయ మీద దాడి చేసారని అన్నారు. పట్ట పగలు విజయనగరంలో శ్రీరామ చంద్రమూర్తి దేవాలయాన్ని దాడి చేస్తే ఇంత వరకు చెర్యలు తీసుకోలేదన్నారు.
పిఠాపురంలో చాలా ఆలయాల మీద దాడి చేస్తే చర్యలు తీసుకోవడం లేదన్నారు. శ్రీ వెంకటేశ్వర్లు స్వామి తిరుపతి దేవస్థానంలో మొత్తం కమర్షియల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో వాటర్ బాటిల్ రూ.50 లేదు కానీ.. తిరుపతిలో వాటర్ బాటిల్ రూ.50 ఉందన్నారు. 10 రూపాయలు ఉండవల్సిన లడ్డూ 100 రూపాయలు చేశారని ఫైర్‌ అయ్యారు. తిరుపతిలో చాలా అపచారాలు చేస్తున్నారని అన్నారు.

గుళ్లలో ఉండే అర్చకులను భీమవరంలో కొడుతున్నారు. ఈ వైస్సార్సీపీ ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రి ఎం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. కనకదుర్గ గుడి మీద చీరలు అమ్ముకున్నారు.. అన్నవరం సత్యనారాయణ స్వామ గుడిలో అర్చకులను వేలం వేశారు.. తిరుపతి దర్శనం టికెట్స్ అమ్ముకుంటున్నారని సీఎం జగన్‌ పాలన తీరుపై విమర్శలు చేశారు. ఈ వైస్సార్ ప్రభుత్వంలో గుళ్ల మీద నియమ నిబంధనలు పటించడం లేదని.. మహిళలు ఇళ్లలో కూర్చొని బాధ పడుతున్నా ప్రభుత్వానికి కనిపించటం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో హిందూ ధర్మానికి రక్షణ ఏది?.. బ్రాహ్మణను లకు రక్షణ ఏది ?అని అన్నారు. ఇలా చేస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాపం తగులుతుదన్నారు. హిందూలు మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోం అని తెలుగుదేశం పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వాని హెచారిస్తున్నామన్నారు.

Also Read: వైసీపీపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం

Advertisment
Advertisment
తాజా కథనాలు