Market Capitalization : నాలుగుకోట్ల కోట్ల రూపాయలు.. రికార్డ్ సృష్టించిన కంపెనీల మార్కెట్ క్యాప్.. 

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) లిస్ట్ అయినా కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డ్ సృష్టించింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,29,32,991.65 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ బుధవారం (జూన్ 12) ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 77,079.04 పాయింట్లను చేరడంతో ఇది సాధ్యం అయింది. 

Market Capitalization : నాలుగుకోట్ల కోట్ల రూపాయలు.. రికార్డ్ సృష్టించిన కంపెనీల మార్కెట్ క్యాప్.. 
New Update

BSE Listed Companies : నాలుగు కోట్ల కోట్ల రూపాయలు.. మీరు చదివింది సరిగ్గానే ఉంది. కోట్ల అనే మాట పొరపాటున రెండు సార్లు రాలేదు. మన స్టాక్ మార్కెట్లో (Stock Market) లిస్ట్ అయినా కంపెనీల మార్కెట్ క్యాప్ నాలుగు కోట్ల కోట్ల రూపాయలను దాటింది. ప్రస్తుతం  భారత స్టాక్ మార్కెట్ ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతోంది. బుధవారం మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ కనిపించింది. అదే సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ)లో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ ఇప్పటి వరకు గరిష్ట స్థాయికి చేరుకుంది. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ ఇప్పుడు రూ.4,29,32,991.65 కోట్లకు చేరుకుంది. 

Market Capitalization : హెచ్చు తగ్గుల మధ్య 20 కంపెనీల బిఎస్‌ఇ (BSE) స్టాక్‌ సూచీ ‘సెన్సెక్స్‌’ బుధవారం 149.98 పాయింట్లు ఎగబాకింది. ఇది మొత్తం 0.20 శాతం పెరుగుదల. సాయంత్రం ట్రేడింగ్ తర్వాత సెన్సెక్స్ 76,606.57 పాయింట్ల వద్ద ముగిసింది. రోజు ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 593.94 పాయింట్లు లేదా 0.77 శాతం లాభాన్ని నమోదు చేసి 77,050.53 పాయింట్లకు చేరుకుంది. ఇటీవలి రోజుల్లో, బిఎస్‌ఇ సెన్సెక్స్ తన ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 77,079.04 పాయింట్లను తాకింది.

మార్కెట్ క్యాప్  5 ట్రిలియన్స్ కంటే ఎక్కువ
స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్‌ (Bullish Trend) తో ఇన్వెస్టర్లు నేరుగా లాభపడ్డారు. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,29,32,991.65 కోట్లకు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే.. భారత్‌లో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల ఎంక్యాప్ 5.14 లక్షల కోట్ల డాలర్లు అంటే 5 లక్షల కోట్ల డాలర్లు దాటింది. బుధవారం మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ ఉంది. , అయితే అంతకుముందు కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్‌లో బలహీన ధోరణి కనిపించింది. బిఎస్‌ఇలో మొత్తం 17,61,53,464 మంది ఇన్వెస్టర్లు ట్రేడవుతున్నారు.

Also Read: ఈపీఎఫ్ గుడ్ న్యూస్.. క్లెయిమ్‌ కోసం చెక్ అవసరం లేదు!

MCAP అంటే ఏమిటి?
మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. కానీ స్టాక్ మార్కెట్ గురించి తెలియని వారికి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఒక కంపెనీ వాస్తవ మార్కెట్ విలువ అని చెప్పవచ్చు.  దీనిని కంపెనీ షేర్ ధరను బట్టి నిర్ణయిస్తారు. 

ఒక కంపెనీ తన షేర్లలో 100 శాతం మార్కెట్‌లో ట్రేడింగ్ కోసం ఉంచింది అనుకుందాం. ఇప్పుడు ఈ షేర్ల సంఖ్య 1000 అని భావిస్తే,  ఐపీఓ ద్వారా కంపెనీ ఈ షేర్లను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు దీని ధర రూ.10లు.  ఈ విధంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.10,000 అయింది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, కంపెనీ షేర్ విలువ పెరిగి రూ.20లకు చేరితే, ఈ కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ లేదా క్యాపిటలైజేషన్ రూ.20,000 అవుతుంది.

#stock-market-news #market-capitalization #bse #bullish
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe