EPF Claim: ప్రయివేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ మంచి సేవింగ్స్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నెల నెలా జీతం నుంచి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఆటోమేటిక్ గా సంస్థల యాజమాన్యం కట్ చేసి.. తమ కంట్రిబ్యూషన్ తో కలిపి ఈపీఎఫ్ ఎకౌంట్ లో జమచేస్తుంది. దీనిపై ప్రభుత్వం మంచి వడ్డీరేటు ఇస్తుంది. ఈపీఎఫ్ లో జమ అయిన డబ్బులను మధ్యలో ఏదైనా అత్యవసర సమయంలో విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివలన చిన్న ఉద్యోగులకు ఇది మంచి సేవింగ్స్ ఎంపికగా భావించవచ్చు. గతంలో ఈపీఎఫ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈపీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవడం ఆన్ లైన్ లోనే సులభంగా చేసుకునే వెసులుబాటు తీసుకువచ్చింది ప్రభుత్వం. గత కొంత కాలంగా ఈపీఎఫ్ కు సంబంధించి చాలా మార్పులు ఉద్యోగులకు అనుకూలంగా తీసిఉంటూ వస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో మరో కొత్త మార్పును తీసుకువచ్చారు.
పూర్తిగా చదవండి..EPF Claim: ఈపీఎఫ్ గుడ్ న్యూస్.. క్లెయిమ్ కోసం చెక్ అవసరం లేదు!
ఈపీఎఫ్ నుంచి అడ్వాన్స్ లేదా ఇతర క్లెయిమ్స్ చేసుకోవడానికి ఇకపై చెక్ లేదా బ్యాంక్ పాస్ బుక్ సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే, ఈపీఎఫ్ చందాదారులు తమ బ్యాంక్ ఎకౌంట్ కేవైసీ అప్ డేట్ చేసుకుంటేనే వారికి చెక్ లేదా పాస్ బుక్ తో పనిలేకుండా క్లెయిమ్ సెటిల్ చేస్తారు.
Translate this News: