Bomb Threat: ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న విస్తారా ఫ్లైట్‎కు బాంబు బెదిరింపు..!!

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢిల్లీ పూణే విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులోని ఐసోలేషన్ బేలో ఉన్న విమానంలో సెర్చింగ్ జరుగుతోంది. ప్రయాణీకులందరితోపాటు వారి లగేజీని కూడా సురక్షితంగా దించేశారు సిబ్బంది.

New Update
Bomb Threat: ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న విస్తారా ఫ్లైట్‎కు బాంబు బెదిరింపు..!!

Bomb threat on Delhi-Pune flight : ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢిల్లీ పూణే విస్తారా విమానంలో బాంబు ఉందన్న వార్త కలకలం రేపింది. దీంతో ఎయిర్ పోర్టు పోలీసులు విమానంలో సెర్చింగ్ చేపట్టారు. ప్రయాణీకులతో పాటు వారి లగేజీని కూడా సురక్షితంగా దించేశారు. విమానంలో బాంబు ఉందన్న సమాచారం జీఎంఆర్‌ కాల్‌ సెంటర్‌కు అందింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సోదాల్లో విమానంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు కాల్ సెంటర్‌లో ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చాయి. విమానంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ ముగిసిందని తెలిపారు. బాంబు కాల్ బూటకపు కాల్ అని ప్రకటించారు. ఫేక్ కాల్ చేసి ఆకతాయిలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు ఢిల్లీ పోలీసులు.

Also Read: స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆపడానికి హాస్టళ్ళలో స్ప్రింగ్ ఫ్యాన్లు..దుమ్మెత్తి పోస్తున్న సోషల్ మీడియా!!

Advertisment
తాజా కథనాలు