Bomb Threat: ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

ముంబయి విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో తిరువనంతపురం విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్‌ ను ప్రకటించారు.

New Update
Vijayawada : బెజవాడ వాసులకు శుభవార్త!

Bomb Threat: ముంబయి నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో గురువారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్‌ ను ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు ల్యాండ్ అవ్వగా..దానిని ఐసోలేషన్‌ బే కి తరలించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే పైలట్‌ కి బాంబు బెదిరింపు సమాచారం వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విమానంలో సుమారు 135 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.

Also Read: మెగాస్టార్‌ బర్త్‌ డే స్పెషల్‌.. అర్థరాత్రి ”విశ్వంభర” అదిరిపోయే ట్రీట్‌!

Advertisment
తాజా కథనాలు