Tihar Jail: తిహార్ జైలుకు బాంబు బెదిరింపు.. డేంజర్ లో కవిత?

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. తిహార్ జైలును పేల్చేస్తామంటూ అగంతకులనుంచి మెయిల్ వచ్చినట్లు జైలు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

Tihar Jail: తిహార్ జైలుకు బాంబు బెదిరింపు.. డేంజర్ లో కవిత?
New Update

Tihar Jail: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం మరోసారి కలకలం రేపింది. ఈ జైలును పేల్చేస్తామంటూ అగంతకులు మెయిల్ చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని, జైలు పరిసర ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఇదే జైలులో ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు ఖైదీలుగా ఉన్నారు. దీంతో కవిత అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఇటీవలే ఢిల్లీలోని పలు స్కూల్స్‌, హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

ఇక ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఆమె కస్టడీనీ ఈ నెల 20 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ఈ రోజుతో కవిత రిమాండ్ ముగిసింది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమె కస్టడీని మరో 6 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మే 20 వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. ఈ కేసుకు సంబంధించి 8 వేల పేజీలతో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేపడతామన్న జడ్జి తెలిపారు.

#bomb-threat #tihar-jail
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe