Tihar Jail: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం మరోసారి కలకలం రేపింది. ఈ జైలును పేల్చేస్తామంటూ అగంతకులు మెయిల్ చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని, జైలు పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఇదే జైలులో ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు ఖైదీలుగా ఉన్నారు. దీంతో కవిత అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఇటీవలే ఢిల్లీలోని పలు స్కూల్స్, హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
పూర్తిగా చదవండి..Tihar Jail: తిహార్ జైలుకు బాంబు బెదిరింపు.. డేంజర్ లో కవిత?
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. తిహార్ జైలును పేల్చేస్తామంటూ అగంతకులనుంచి మెయిల్ వచ్చినట్లు జైలు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.
Translate this News: