Adil Hussain : ఆ విషయంలో శ్రీదేవి - జాన్వీ కపూర్ సేమ్ టూ సేమ్ : బాలీవుడ్ నటుడు

'ఉలఝ్‌' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు అదిల్‌ హుస్సేన్‌.. జాన్వీకపూర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపట్ల శ్రీదేవికి ఏవిధమైన ఏకాగ్రత, అంకితభావం ఉండేదో.. అదే ఇప్పుడు జాన్వీకపూర్‌లో చూశా. ఈ విషయంలో జాన్వీని చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉందని అన్నారు.

New Update
Adil Hussain : ఆ విషయంలో శ్రీదేవి - జాన్వీ కపూర్ సేమ్ టూ సేమ్ : బాలీవుడ్ నటుడు

Bollywood Senior Actor Adil Hussain : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉలఝ్‌' (Ulajh) . జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా డైరెక్ట్ చేశారు. గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌తోపాటు అదిల్‌ హుస్సేన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదిల్‌.. జాన్వీకపూర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపై ఆమెకున్న అంకితభావాన్ని మెచ్చుకున్నారు.

‘‘శ్రీదేవి (Sridevi) ఫిల్మోగ్రఫీలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’. అందులో నేనూ నటించా. ఆ సినిమా సెట్స్‌లోనే తొలిసారి జాన్వీకపూర్‌ను చూశా. అప్పుడు ఆమె వయసు 14 ఏళ్లు. శ్రీదేవితో కలిసి తను రోజూ సెట్‌కు వచ్చేది. తన తల్లి యాక్టింగ్‌ను ప్రతిక్షణం గమనిస్తూ ఉండేది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె కథానాయికగా నటించిన ‘ఉలఝ్‌’లో యాక్ట్‌ చేశా.

Also Read : రజినీకాంత్ ‘వెట్టైయాన్‌’ లో తన పాత్ర ఏంటో రివీల్ చేసిన మలయాళ హీరోయిన్.!

వృత్తిపట్ల శ్రీదేవికి ఏవిధమైన ఏకాగ్రత, అంకితభావం ఉండేదో.. అదే ఇప్పుడు జాన్వీకపూర్‌లో చూశా. దర్శకుడు చెప్పినవిధంగా యాక్ట్‌ చేయడం.. సీన్స్‌ గురించి అడిగి తెలుసుకోవడం.. సెట్‌లో ఉన్నవారందరినీ గౌరవించడం ఇలా ప్రతీ విషయంలో జాన్వీని చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది’’ అని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు