/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T145541.446.jpg)
Bollywood Director Hansal Mehta Comments On Balakrishna Behaviour : 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బిహేవియర్ చూసి అందరూ షాక్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఈవెంట్ లో బాలయ్య హీరోయిన్ అంజలిని నెట్టేయడం పలు వివాదాలకు దారి తీసింది. నెట్టింట తెగ వైరల్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్స్ తో పాటూ సినీ విశ్లేషకులు సైతం బాలయ్య పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ అగ్ర దర్శకుడు బాలయ్య ప్రవర్తన చూసి ఆయన్ని దారుణంగా తిట్టాడు.
సభ్యత, సంస్కారం లేని మనిషి...
బాలీవుడ్ లో స్కామ్1992 , ఛల్, షాహిద్, సిటీలైట్స్, అలీఘర్ వంటి సినిమాలతో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హన్సల్ మెహతా తాజాగా బాలయ్య బిహేవియర్ పై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ లో అంజలిని నెట్టేసిన వీడియోని షేర్ చేస్తూ.. "ఎవరు ఈ సభ్యత, సంస్కారం లేని మనిషి" అంటూ పోస్ట్ పెట్టాడు.
Also Read : బాలకృష్ణకు దండం.. అంజలి ట్విట్ వైరల్.. మీరు అలా చేసినందుకు..!
కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు ఇదే ఈవెంట్లో బాలయ్య వాటర్ బాటిల్‌లో మందు కలుపుకోని తాగాడని, అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు.
" బాలయ్య వాటర్ బాటిల్‌లో మందు కలుపుకోని రావడం అనేది అబద్దం. అవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్. సీజీ క్రియేట్ చేసి కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈవెంట్ అయిపోయేవరకు నేను అక్కడే ఉన్నా అసలు అక్కడ అలాంటి బాటిల్ ఏదీ లేదంటూ” నాగవంశీ తెలిపాడు.
Who is this scumbag? https://t.co/KUVZjMZY2M
— Hansal Mehta (@mehtahansal) May 29, 2024