Pushpa 2: పుష్ప లవర్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఐటెమ్‌ సాంగ్‌లో ఎవరంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
Pushpa 2: పుష్ప లవర్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఐటెమ్‌ సాంగ్‌లో ఎవరంటే?

Pushpa 2 Item Song Actress: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్'. 2024 లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ , ఫస్ట్ సింగిల్ తో పార్ట్ 1 ను మించి పార్ట్ 2 ఉండబోతున్నట్లు అర్థమైంది. పుష్ప 2 తో అల్లు అర్జున్- సుకుమార్ మరో సారి రికార్డులు తిరగరాయడం ఖాయమని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప 2 కు సంబందించిన మరో అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. ఈసారి సమంత స్థానంలో బాలీవుడ్ భామ ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ బ్యూటీ ఎవరనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి

అయితే సినీ వర్గాల నివేదికల ప్రకారం.. బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు చెబుతున్నారు. త్రిప్తి (Triptii Dimri) పుష్ప-2లో ఉండబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి ఆమె అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అల్లు అర్జున్, త్రిప్తి కాంబినేషన్ స్క్రీన్ పై మామూలుగా ఉండదు.. అదిరిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ దీని పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Pushpa 2 Item Song Actress

'ఊ అంటావా మావ'

పుష్ప పార్ట్ 1 లో సమంత (Samantha) చేసిన 'ఊ అంటావా మావ' సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది ఈ సాంగ్. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాటకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పాటలో సమంత ఎక్స్ ప్రెషన్స్, డాన్స్ , యాటిట్యూడ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 ఐటం సాంగ్ కోసం త్రిప్తి పేరు వినిపించడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగిపోయింది.

Also Read: Kalki 2898 AD : ప్రభాస్ 'బుజ్జి' మామూలుగా లేదుగా.. ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు