Vishwambhara : 'విశ్వంభర' లో బాలీవుడ్ యాక్టర్.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన టీమ్, చిరును ఢీ కొట్టేది ఆయనేనా?

'విశ్వంభర' సినిమా నుంచి ఓ అదిరిపోతే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు భాగం అవుతున్నట్టు తెలిపారు. బాలీవుడ్‌ అగ్ర నటుడు కునాల్‌ కపూర్‌ ‘విశ్వంభర’ టీమ్‌లో జాయిన్‌ అయినట్లు తెలుపుతూ దర్శకుడు పోస్ట్‌ పెట్టారు.

New Update
Vishwambhara : 'విశ్వంభర' లో బాలీవుడ్ యాక్టర్.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన టీమ్, చిరును ఢీ కొట్టేది ఆయనేనా?

Bollywood Actor Kunal Kapoor In Vishwambhara Movie : 'బింబిసార' (Bimbisara) మూవీ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోతే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు భాగం అవుతున్నట్టు తెలిపారు.

పవర్ ఫుల్ రోల్ లో బాలీవుడ్ యాక్టర్...

బాలీవుడ్‌ అగ్ర నటుడు కునాల్‌ కపూర్‌ (Kunal Kapoor) ‘విశ్వంభర’ టీమ్‌లో జాయిన్‌ అయినట్లు తెలుపుతూ దర్శకుడు పోస్ట్‌ పెట్టారు. ఇందులో కునాల్‌ విలన్‌గా కనిపించనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ హీరోపై పోస్ట్‌ పెట్టిన నిర్మాణ సంస్థ.. ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. ఇందులో కునాల్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. ఆయన విలన్ అని తెలిసే ట్విస్ట్‌ సినిమాకే హైలైట్‌ గా ఉంటుందని అంటున్నారు.

Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘లవ్ మీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పటికే ఈ బాలీవుడ్ (Bollywood) యాక్టర్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయి. సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు