Eggs: ఉడకబెట్టిన తర్వాత గుడ్లు ఎంతసేపటిలో తినాలి..?

ఉడికించిన గుడ్లను 5-7 రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఉడకబెట్టేటప్పుడు గుడ్డు పెంకు పగిలితే మాత్రం 2-3 రోజుల్లోనే తినాలి లేదా గుడ్డు పాడైపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్ ఉంటాయి.

New Update
Bealert : చిన్నారి ప్రాణం తీసిన గుడ్డు..చిన్నపిల్లలకు గుడ్డు తినిపించే పేరెంట్స్ జాగ్రత్త..!!

Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లలో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్లను ఎంత సేపు తినాలి అనేది చాలామందిలో డౌట్‌ ఉంటుంది. కొందరూ అల్పాహారం కోసం ఉడకబెట్టిన గుడ్లు తింటే. మరి కొంతమంది ఆమ్లెట్లను తింటారు. గుడ్లు ప్రోటీన్‌కు ఓ గని లాంటిదని, శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ గుడ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తినడానికి ఇష్టపడితే, అవి ఎంతసేపటిలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉడకబెట్టిన గుడ్ల వల్ల ప్రయోజనాలు:

గుడ్లలో ఉండే పోషకాలు బాడీ ఎనర్జీని ఇస్తుంది. గుడ్లలో ప్రోటీన్, ఎరోన్, విటమిన్-ఏ, బీ-6, బీ-12, ఫోలేట్, సెలీనియం, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం నుంచి స్నాక్స్ వరకు ప్రతి ఒక్కరూ గుడ్లు తింటారు.ఇలా ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్ ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్లలో లభించే సెలీనియం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

గుడ్ల ఎన్ని గంటల తరువాత తినాలి..?:

  • ఉడకబెట్టిన గుడ్డు ఫ్రిడ్జ్‌లో 5-7 రోజులు తాజాగా ఉంటుంది.
  • గుడ్లను మెత్తగా ఉడకబెడితే 2 రోజుల్లో తినాలి.
  • ఉడకబెట్టేటప్పుడు గుడ్డు పెంకు పగిలితే 2-3 రోజుల్లో తినాలి.
  • గుడ్డు ఉడికిన తర్వాత చల్లటి నీటిలో ఉంచాలి. అవి చల్లారిన తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవాలి.
  • నీరు ఆరిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అలాంటి గుడ్లలో బ్యాక్టీరియా ఉండదు.

ఇది కూడా చదవండి: పిల్లలు మొబైల్స్‌కు బానిసగా మారారా..? ఎలా బయటపడాలి..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

ఇది కూడా చదవండి: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు