/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-73-2.jpg)
Boeing Cargo: ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో కార్గో విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాల్సివచ్చింది. ఈ క్రమంలో ఫ్లైట్ నెలపై దిగగానే ముందుభాగం ఒక్కసారిగా రనేవేకు రాసుకుంటూ వెళ్లడంతో మంటలొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డట్లు అధికారులు వెల్లడించారు.
Babe wake up! New Boeing 767 crash just dropped! Wonder how many whistleblowers will disappear for this one? pic.twitter.com/lkFj8TcbPU
— Autism Capital 🧩 (@AutismCapital) May 8, 2024
ఈ మేరకు అమెరికా పోస్టల్ కంపెనీ ఫెడెక్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానం బుధవారం ఉదయం పారిస్ నుంచి టర్కీకి చేరుకుంది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధం కాగా ల్యాండింగ్ గేర్ విఫలమైనట్లు పైలట్ గుర్తించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు ఈ విషయం చెప్పారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఆ విమానం ప్రయత్నించగా.. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే విమానం ముందు భాగం రన్‌వేకు రాసుకుంది. అయితే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఫైర్ కంట్రోల్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఫోమ్ చల్లి మంటలు, పొగలను కంట్రోల్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని స్పష్టం చేశారు. ఇక కార్గో విమానం ల్యాండ్ అయిన రన్‌వే తాత్కాలికంగా మూసివేయబడింది.
A cargo plane touched down at Istanbul Airport without its nose gear—the landing gear didn't deploy when it should have. The plane's nose hit the runway, but no one was hurt. pic.twitter.com/YIrP3TEjUy
— Russian Market (@runews) May 8, 2024
Fedex B767 Registry N110FE
Looks like they had a pretty clear landing in such conditions. https://t.co/r37MnpefRm pic.twitter.com/vB3ArvcLX8
— Tango Down (@Tangocharliejui) May 8, 2024