Eden Gardens: క్రికెట్‌ స్టేడియంలో ఉరేసుకున్న యువకుడు.. షాక్‌లో గ్రౌండ్‌ సిబ్బంది!

కోల్‌కతాలోనిని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలోని ఓ గ్యాలరీలో ఓ యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన 21ఏళ్ల ధనుంజయ్ ఈడెన్‌గార్డెన్స్‌ స్టేడియంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి, మేనమావా స్టేడియంలో గ్రౌండ్‌ సిబ్బందిగా పని చేస్తున్నారు.

Eden Gardens: క్రికెట్‌ స్టేడియంలో ఉరేసుకున్న యువకుడు.. షాక్‌లో గ్రౌండ్‌ సిబ్బంది!
New Update

ఈ మధ్యకాలంలో సూసైడ్‌ చేసుకుంటున్న యువకుల సంఖ్య పెరిగిపోతోంది. చిన్న వయసులోనే ప్రాణాలను వదిలేసుకుంటున్నారు కుర్రాళ్లు. కారణం ఏదైనా చావే పరిష్కారమనే భావనలో కొంతమంది ఉండడం బాధాకరం. ఈ ఆత్మహత్యలకు అనేక కారణాలున్నా అందులో ఆర్థికంగా మూడి పడి ఉన్నా రీజన్స్‌ కూడా ఉన్నాయి. తాజాగా ప్రముఖ క్రికెట్‌ స్డేడియం ఈడెన్‌ గార్డెన్స్‌(Eden Gardens)లో ఓ 21ఏళ్ల యువకుడు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే:

కోల్‌కతాలోనిని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలోని ఓ గ్యాలరీలో ఓ యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. మృతుడిని గ్రౌండ్ వర్కర్ కుమారుడు ధనుంజయ్ బారిక్ (21)గా గుర్తించారు. ఈడెన్ గార్డెన్స్ లో గ్రౌండ్ స్టాఫ్ గా నియామకం లభించకపోవడంతో మృతుడు డిప్రెషన్ కు గురై ఉంటాడని సమాచారం. ధనుంజయ్‌ తండ్రి, మేనమామ కూడా అక్కడే పని చేస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్యా లేక మరేదైనా కేసునా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Also Read: ఎంత ఖర్మ పట్టిందిరా బాబు.. రోహిత్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు ముంబై ఏం చేసిందో చూడండి!
డిసెంబర్ 17న మైదాన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైందని కోల్ కతా పోలీసులు తెలిపారు. ఒడిశాకు చెందిన బాధితుడు తన తండ్రి, మేనమామ మాదిరిగానే ఈడెన్ గార్డెన్ లో గ్రౌండ్ మెన్ ఉద్యోగం వస్తుందనే ఆశతో కోల్ కతాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. వారితో పాటే అతను నివాసం ఉంటున్నాడు. కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించకుండా పోయారని వారు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం స్థానిక మైదాన్ పోలీస్ స్టేషన్లో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

Also Read: అయ్యో బిడ్డా.. స్కూల్లో వేడి రాగిజావలో పడ్డ ఆరేళ్ల బాలిక

WATCH:

#suicide #kolkata #eden-gardens
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe