Parliament Elections 2024: బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ.. రంగంలోకి దిగనున్న అధిష్టానం

ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్లమెంట్ క్లస్టర్ ఇంఛార్జి లతో సమావేశం అయిన జెపి nadda, అమిత్ షా,బి.ఎల్ సంతోష్ ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగింది రాబోయే ఎన్నికలకు బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది.

Parliament Elections 2024: బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ.. రంగంలోకి దిగనున్న అధిష్టానం
New Update
Parliament Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో మంచి ఊపు మీదున్న బిజెపి  రాబోయే లోక్ సభ   ఎన్నికలకు బీజేపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. కేంద్రంలో అధికారమే చేపట్టడమే లక్ష్యంగా .. మూడోసారి   అత్యధిక స్తానాల్లో సీట్లు గెలిచేందుకు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యెక ద్రుష్టి సారించారు.
ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం
కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వం లో ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసారు .జెపి నడ్డా , అమిత్ షా,బి.ఎల్ సంతోష్ లు పాల్గొన్న ఈ సమావేశంలో పార్లమెంట్ క్లస్టర్ ఇంఛార్జిలు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై క్యాడర్‌కు ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.ఈ  సమావేశం లో అమిత్ షా మాట్లాడుతూ.. ధన ప్రమేయం లేని ఎన్నికలు జరగాలి .. ప్రజా స్వామ్యం బతకాలి.. సామాన్యుడు సైతం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి రావాలని అన్నారు. 2047 సంవత్శ్రరం  వరకు బీజేపీ ఉండాలని ... దేశానికి బీజేపీ ఆవశ్యకత చాలా ఉందని ... స్వాతంత్య్రం వచ్చి వంద ఏళ్లు పూర్తి అయ్యే సరికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని అన్నారు. మూడో సారి అత్యంత మెజారిటీతో అధికారం లోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక.. పార్లమెంట్ స్థానాలను 143 క్లస్టర్ లుగా  బీజేపీ నిర్ణయించింది. తెలంగాణ లో 5 క్లస్టర్ లు ఏర్పాటు చేసారు. ఒక్కో క్లస్టర్ కు ఒక్కో ఇన్ చార్జ్ ఉంటారు.
తెలంగాణకు షా రాక 
అధికార , ప్రతిపక్ష పార్టీలు ప్రచార పర్వానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో  ఈ నెలాఖరున తెలంగాణా రాష్ట్రానికి  అమిత్ షా రానున్నారు. అనంతరం ఫిబ్రవరి నెలలో తెలంగాణ లో 10 రోజుల పాటు బీజేపీ యాత్రలు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు.  తెలంగాణలో 5 ప్రాంతాల నుంచి ప్రారంభించబోయే ఈ యాత్రలు ,   పార్లమెంట్ క్లస్టర్ వారీగా  చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో జనం గుండెల్లో నాటుకుపోయే ఎజండాలతో వెళ్ళాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. అందులో భాగంగానే .. తెలంగాణ అప్పులు తీరాలన్న , తెలంగాణ అభివృద్ది చెందాలన్న మరో సారి మోడీ అధికారం లోకి రావాలి... ఈ అంశంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ఆలోచన ఉంది.

సౌత్ తెలంగాణాలో బోణీ కొట్టేందుకు 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల ఎంపికకై ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టింది. మొన్న ఫలితాలను సృష్టిలో పెట్టుకున్న బిజెపి నార్త్ తెలంగాణలో తన సత్తా చాటుకుంది.  ఈ ఎన్నికల్లో సౌత్ తెలంగాణా లో బోణీ కొట్టి పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
క్రేజ్ ఉన్న నాయకునికే టికేట్
ముఖ్యంగా ఎంపీ టికెట్ల ఆశిస్తున్న వారిపై బీజేపీ అగ్రనేత అమిత్ షా  స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు  తెలుస్తోంది.ప్రజలలో క్రేజ్ ఉన్న నాయకునికే టికేట్ ఇవ్వాలని .. ఇందుకు సంబందించిన ఫీడ్ బ్యాక్ సైతం  ఎప్పటికప్పుడు  గోప్యంగా తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే గెలిచే దమ్మున్న వారికే  టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
#narendra-modi #telangana #amith-shah
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe