కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, ఎన్నికల సన్నద్ధత, బీజేపీ జాతీయ నేతలతో సభలుపై చర్చ జరగనుంది. రాజకీయ తీర్మానంతో పాటు, మోదీకి ధన్యవాద తెలుపుతూ తీర్మానాలు తెలిపారు. ఈ అశంపై జేపీ నడ్డా, సంతోష్ మార్గనిర్దేశనం చేయనున్నారు. చాలా ఏళ్ళ తరవాత ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. జాతీయ, రాష్ట్ర పదాధికరులు, కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు , జిల్లా ఇంఛార్జిలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇంఛార్జిలు, కన్వీనర్‌లుకు ఆహ్వానం ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసే పనిలో బీజేపీ ఉంది. మోదీ సభల తరవాత మార్పు వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నెలలో 30 పైగా సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
జోరుమీదున్న బీజేపీ
అయితే... తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించే దిశగా అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను బీజేపీ ఖరారు చేస్తోంది. ఓటర్ల మద్దతును పొందడానికి ఏమి చేయాలి..? ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఎండగట్టాలి..? ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏ విధమైన హామీలు ఇవ్వాలి..? అనేటువంటి అనేక అంశాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఈ కీలక భేటీ అయ్యారు. బీజేపీ ఎన్నికల రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. దీనిలో.. ప్రధానంగా 20 అంశాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని బీజేపీ అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా.. 43 బహిరంగ సభలను నిర్వహించేందుకు వ్యూహాలు చేస్తోంది. ఈ సభలకు ఢిల్లీ అగ్ర నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోదీతో వారంలో రెండు సభలు నిర్వహించి జోరుమీదున్న బీజేపీ.. ఎన్నికల వరకూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అనంతరం కీలక నేతలతో నడ్డా భేటీ కానున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ గెలుపే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాలపై కూడా నేతలు చర్చిస్తున్నారు.