గత కొద్ది రోజుల నుంచి ప్రియాంక గాంధీ (Priyanka Gndhi) , రాహుల్ గాంధీ (Rahul gandhi) మధ్య విభేదాలు తలెత్తినట్లు బీజేపీ(BJP) వారు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ప్రియాంక గాంధీని కాంగ్రెస్ (Congress) పార్టీ రాజకీయంగా తక్కువ చేసి చూడటంతో పాటు ఆమెకు పార్టీలో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని పేర్కొంది. ఆ విషయమే అన్నాచెల్లెళ్ల మధ్య దూరానికి కారణమయ్యిందని పేర్కొంది.
ఈ విషయాన్ని బీజేపీ వారు ట్వీట్టర్(Twotter) వేదికగా తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో చూపుతున్న విభేదాల వల్ల ప్రియాంక కాంగ్రెస్ కి దూరమవ్వడంతో పాటు, ఒక కుటుంబానికి కూడా దూరమవుతుందని వివరించింది. వారి తల్లి సోనియా కూడా రాహుల్ కే ఆమె పూర్తి మద్దతినివ్వడంతో ప్రియాంక పార్టీ కార్యకలాపాలకు మరింత దూరం జరిగేటట్లు చేసిందని వివరించింది.
ఈ క్రమంలోనే ప్రియాంక ఘమాండీ కూటమి సమావేశాలకు కూడా హాజరు కాలేదని తెలిపింది. కేవలం ఎన్నికల సమయంలో ప్రచారానికి మాత్రమే రాహుల్ తన సోదరిని ఎలా ఉపయోగించుకుంటున్నారో చూడండి అంటూ బీజేపీ వారు విడుదల చేసిన వీడియోలో ఉంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆమె తన అన్న చేతికి రాఖీ కూడా కట్టలేదని పేర్కొన్నారు.
ఈ విషయాలన్నింటిని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినేట్ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ రక్షా బంధన్ రోజున రాఖీ కట్టారు. కావాలంటే చూడండి అంటూ ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '' మీ కళ్లు, మెదడు రెండింటికి కూడా చికిత్స చేయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఆమె పేర్కొన్నారు.
మరి దీని గురించి బీజేపీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.