DK Aruna: పార్టీ మార్పుపై డీకే అరుణ సంచలన ప్రకటన! తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ. ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కావాలనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యాక్ష పదవి ఇచ్చిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేసే అదృష్టం ఉండాలన్నారు. తన స్పందన గురించి తెలుసుకోకుండా ఇలా కథనాలు రాయడం సరికాదన్నారు. తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు. By Bhoomi 26 Oct 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో చాలా మంది నేతలు పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కూడా కాంగ్రెస్ లోకి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ తరపున గద్వాల నుంచి పోటీ చేస్తానన్న డీకే అరుణ ఇటీవల మాట మార్చారంటూ ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్న అంతర్గత సమాచారంతోనే డీకే అరుణ వెనక్కు తగ్గారని..గద్వాల నుంచి బీసీ అభ్యర్థిని నిలబెడితే పూర్తి మద్దతు ఇచ్చి గెలిపిస్తామని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే డీకే అరుణ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారంటూ..జోరుగా ప్రచారం సాగుతోంది. చివరి నిమిషంలో రాజగోపాల్ రెడ్డి మాదిరే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇది కూడా చదవండి: సత్యపాల్ మాలిక్‌తో రాహుల్…పుల్వామా దాడులు, అదానీ గురించి చర్చించా..!! ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న కథనాలపై డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కావాలనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యాక్ష పదవి ఇచ్చిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేసే అదృష్టం ఉండాలన్నారు. తన స్పందన గురించి తెలుసుకోకుండా ఇలా కథనాలు రాయడం సరికాదన్నారు. తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించాల్సిన హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ తెలిపారు. ఇది కూడా చదవండి: టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. నేడు మునుగోడు గడ్డపై కేసీఆర్ మీటింగ్! #gadwala #dk-aruna #bjp-national-vice-president #party-changing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి