Telangana:'ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది'.. బీఆర్ఎస్‌కు బీజేపీ నేత వార్నింగ్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో చక్రం తిప్పుతా అని.. కనీసం బొంగురం కూడా తిప్పలేకపోయారు అంటూ సెటైర్లు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు.

New Update
Telangana:'ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది'.. బీఆర్ఎస్‌కు బీజేపీ నేత వార్నింగ్..

BJP MP Laxman Comments on BRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్(Laxman) సంచలన కామెంట్స్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో(Delhi) చక్రం తిప్పుతా అని.. కనీసం బొంగురం కూడా తిప్పలేకపోయారు అంటూ సెటైర్లు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు. గురువారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. ప్రధాని నరేంద్ర మోదీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా కేటీఆర్ చేస్తున్న కామెంట్స్‌పై లక్ష్మణ్ సీరియస్‌గా అయ్యారు. బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సంకేతాలు ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచాం తప్ప.. ఎన్నికల్లో ఏనాడూ కలవలేదని క్లారిటీ ఇచ్చారు లక్ష్మణ్. అబద్దాలకు కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. మోదీ అసలు రహస్యాన్ని బయట పెట్టడంతో.. బీఆర్ఎస్ నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా తయారైందన్నారు. అందితే జుట్టు.. లేకపోతే కాళ్లు పట్టుకోవడం బీఆర్ఎస్ నైజం అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీది పచ్చి అవకాశ వాదం అని, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరాన్నజీవి అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు లక్ష్మణ్. తనను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్ఎస్ దుకాణం బంద్ చేస్తామని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు లక్ష్మణ్. 'గత ఎన్నికల్లో సారూ.. కారు.. పదహారు అన్నారు ఏమైంది? ఢిల్లీలో చక్రం తిప్పుతా అన్నారు.. బొంగురం కూడా తిప్పలేదు. ప్రధాని రెండు సభలు ట్రైటర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది.' అని బీఆర్ఎస్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు లక్ష్మణ్.

అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వస్తే.. పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. ఆస్కార్, నోబెల్ బహుమతులను ఆయనకు ఇవ్వొచ్చన్నారు. అధికారం తలకెక్కి డబ్బుల అండతో తెలంగాణను ఏమైనా చేస్తామని అహాంకార పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వస్తే కనీసం కలవడం కూడా చేతకాక.. చెత్త పోస్టర్లు అంటించారంటూ నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తె టూరిస్ట్ అని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ కర్మాగారం పెడతానని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. కేంద్రం ఇవ్వకపోయినా స్టీల్ ఫ్యాక్టరీ తానే పెడతానంటూ కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక కమిటీలు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఫీజుబులిటీ లేదని తేల్చి చెప్పాయని వివరించారు.

‘ఆ విషయంలో కేసీఆర్‌కు ఆస్కార్, నోబెల్ అవార్డ్ ఇవ్వొచ్చు’

Advertisment
తాజా కథనాలు