Telangana: ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుపై రేవంత్ చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అరవింద్. పసుపు బోర్డు దేనికి ఉపకరిస్తుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని సెటైర్లు వేశారు.

New Update
Telangana: ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..

Revanth Reddy vs Arvind: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Arvind) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుపై రేవంత్(Revanth Reddy) చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అరవింద్. పసుపు బోర్డు దేనికి ఉపకరిస్తుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని సెటైర్లు వేశారు. హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్‌లో బీజేపీ మీటింగ్ జరుగుతోంది. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అరవింద్.. రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు. పసుపు బోర్డుపై ఏమాత్రం అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మంత్రిగా పని చేసిన అనుభవం రేవంత్ రెడ్డికి లేదని, ఆయన గురువు జైళ్లో ఊచలు లెక్కిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తన జీవితంలో మొత్తంలోనూ మంత్రి కాలేడని జ్యోస్యం చెప్పారు.

పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలో తమకు తెలుసునని రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ పెడితే ఆయనకు ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పసుపు పంటను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు గుప్పించారు. చెరుకు ఫ్యాక్టరీలను కనుమరుగు చేసింది టీడీపీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడో ఎవరికీ తెలియదన్నారు.

ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!

తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు ఎంపీ అరవింద్. తెలంగాణను సోనియా గాంధీ ఇవ్వడం ఏంటి.. వందలాది మంది ఆత్మహత్య చేసుకున్నాక స్పందిస్తే.. తెలంగాణ ఇచ్చినట్లా? అని ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలు ఛీ కొడితే.. నేరుగా మల్కాజిగిరిలో పడ్డారని రేవంత్‌పై పంచ్‌లు వేశారు. రాష్ట్రంలోని సగం పార్లమెంట్ స్థానాల్లో ఆంగ్రెస్ పార్టీ అడ్రస్సే లేదన్నారు. ఇలాంటి పార్టీకి 61 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. అదానిపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అదానిని పైకి తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు ధర్మపురి అరవింద్. ఆదాని వ్యాపారం విస్తరించిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో సోనియా గాంధీపైనా ఎంపీ అరవింద్ తీవ్ర కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ కాదు.. స్కామ్‌ల గాంధీ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఏమైందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రేవంత్. పనిలో పనిగా మంత్రి కేటీఆర్‌పైనా విమర్శలు చేశారు. కేటీఆర్ మత్తు పదార్థాలను వాడటం మానుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ రెండు సార్లు ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న ఎంపీ అరవింద్.. ఈసారి కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టోను చించివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను కూడా ఆ మేనిఫెస్టోని చించేస్తానని అన్నారు.

ఇదికూడా చదవండి: భవ్యశ్రీ హత్య కేసు ఏమైంది..20 రోజులైన రాని క్లారిటీ..!

Advertisment
తాజా కథనాలు