BJP MLA : పోలీస్‌ను చెంపపై కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి చెంప చెళ్లుమనిపించారు పూణే బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌ కాంబ్లే. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇస్తూ.. తాను ఆ అధికారిని కొట్టలేదని.. కేవలం నెట్టేసినట్లు తెలిపారు.

New Update
BJP MLA : పోలీస్‌ను చెంపపై కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

BJP MLA Slaps Police Officer : విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారి చెంప చెళ్లుమనిపించారు బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA). ఈ ఘటన మహారాష్ట్ర(Maharashtra) లో చోటుచేసుకుంది. దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

అసలేం జరిగింది..

నిన్న(శుక్రవారం) మహారాష్ట్రలోని పుణెలోని సాసూన్‌ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పుణె కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా బీజేపీ నేత సునీల్‌ కాంబ్లే (BJP MLA Sunil Kamble) సహనం కోల్పోయారు. పోలీస్ అధికారిపై చేయి చేసుకున్నారు. అసలేం జరిగిందంటే సాసూన్‌ ఆస్పత్రి నిర్వహించిన కార్యక్రమానికి మహారాష్ట్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు.

ALSO READ: ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్.. డేట్ ఫిక్స్.. హరీష్ రావు కీలక ప్రకటన

ఈ నేపథ్యంలో స్టేజి మీద నుంచి కిందికి దిగే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌ కాంబ్లే కింద పడిపోతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ పోలీస్ అధికారి చెంపపై కొట్టారు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎమ్మెల్యే సునీల్‌ కాంబ్లే ఆగ్రహానికి అసలు కారణం ఆ కార్యక్రమానికి ఆహ్వానించే ఇన్విటేషన్ పత్రికలో అతని పేరు లేకపోవడమే అని.. అందువల్లే ఆయన సహనం కోల్పోయి ఆ పోలీస్ అధికారిని కొట్టాడని అక్కడున్న నేతలు ఆరోపిస్తున్నారు.

నేను కొట్టలేదు.. ఎమ్మెల్యే రియాక్షన్..

సోషల్ మీడియాలో పోలీస్ అధికారిని కొట్టిన వీడియో వైరల్ కావడం.. ఈ ఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో దీనిపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే సునీల్‌ కాంబ్లే. తాను ఆ అధికారిని కొట్టలేదని.. నెట్టానని చెప్పారు. అయితే, కింద ఉన్న వీడియోను చూసి ఆ ఎమ్మెల్యే కొట్టాడా?.. లేదా? మేరె చెప్పండి.

ALSO READ: అంగన్వాడీలకు షాక్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ

Advertisment
Advertisment
తాజా కథనాలు