Telangana: బీజేపీ అధిష్టానంపై అలిగిన రాజాసింగ్.. ఎందుకంటే..

బీజేపీ అధిష్టానంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అలిగారు. ఓవైపు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనంటూనే.. తనకు బీజేఎల్పీ పదవి కోసం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేఎల్పీ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.

Telangana: బీజేపీ అధిష్టానంపై అలిగిన రాజాసింగ్.. ఎందుకంటే..
New Update

BJP MLA Raja Singh: బీజేపీ అధిష్టానంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అలిగారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. బీజేపీ నేతలు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించినా.. అందుబాటులోకి రాలేదు. మరి రాజాసింగ్ అలకకు కారణం ఏంటో ఓసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అయితే, ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమించారు. దీనిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అక్బరుద్దీన్ ఎదుట తాను ప్రమాణ స్వీకారం చేయబోనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో.. రాజాసింగ్ మధ్యలోనే బీజేఎల్పీ సమావేశం నుంచి వెళ్లిపోయారు.

దీనికంటే ముఖ్యంగా మరో కారణం ఉందని తెలుస్తోంది. శాసనసభలో బీజేపీ పక్ష నేత పదవి కోసం రాజాసింగ్ పట్టుబడుతున్నారట. ఎమ్మెల్యేగా రాజాసింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. మిగతా సభ్యుల్లో ఆరుగురు కొత్తవారే ఉన్నారు. దాంతో రాజాసింగ్ తనకు బీజేఎల్పీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ క్రమంలో బీజేఎల్పీ సమావేశం మధ్యలోంచే బయటకు వెళ్లిపోయిన ఆయన.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కూడా వెళ్లలేదు. బీజేపీ నేతలు ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా.. అందుబాటులోకి రాలేదు. రాజాసింగ్ అలక కారణంగా మిగతా సభ్యులు కూడా అసెంబ్లీని బహిష్కరించారని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.

ప్రొటెం స్పీకర్ ఎంపికపై బీజేపీ ఆగ్రహం..

కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శాసనసభా గౌరవాన్ని కాలరాసేలా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సభలో సీనియర్ సభ్యులు ఉన్నా వారందరినీ కాదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నారని ఆరోపించారు. ఎంఐఎంతో ఒప్పందంలో భాగంగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని ఆరోపించారు కిషన్ రెడ్డి. సభ నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్.. ఇప్పుడు అక్బరుద్దీన్ ను ప్రొటెంస్పీకర్ గా ఎలా నియమించిందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ ను కలిసి కోరుతామన్నారు కిషన్ రెడ్డి.

Also Read:

కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..!

#telangana-assembly #telangana-bjp #bjp-mla-raja-singh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe