Telangana Elections 2023: తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారాల్లో అన్ని పార్టీలు తమశైలిలో దూసుకుపోతున్నాయి. తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలో బుర్ఖాలో వచ్చి దొంగ ఓట్లు వేశారని... ఈసారి ఎన్నికల్లో ఇలా జరగకుండా చూసుకోవాలని సీఈవో వికాస్ రాజ్‌ను కోరారు. ముస్లిం మహిళలు కొందరు ఓటు వెయ్యడానికి బుర్ఖాలో వస్తారని, వారిని గుర్తించేందుకు అధికారులకు ఇబ్బందిగా మారింది. ఇలా వారు బుర్ఖాలో రావడం ద్వారా రిగ్గింగ్ ఈజీగా జరుగుతుందని అన్నారు. ఇలా జరుగుతున్న అక్కడి అధికారులు మాత్రం ఏమి చేయడం లేదని వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్ర వద్ద భద్రత పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పోలింగ్ టైంలో బూత్ లోకి ఎవరు వచ్చినా ఐడీ కార్డు చూపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!
పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏజెంట్లుగా వ్యవహిస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో చాలావరకు బోగస్ ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఈసారి ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సీసీటీవీ, పోలీస్, సెంట్రల్ ఫోర్సెస్ ఉంచాలని వికాస్ రాజ్ ను కోరినట్లు చెప్పారు. కొంతమంది పోలీస్ అధికారులు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ALSO READ: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!