Alleti Maheshwar Reddy: వంద కోట్లు ఢిల్లీకి పంపారు.. మంత్రి ఉత్తమ్‌పై ఏలేటి సంచలన ఆరోపణలు

TG: మంత్రి ఉత్తమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో కొత్తగా U ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఉత్తమ్ ఢిల్లీకి 100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి.

New Update
Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై విమర్శలు గుప్పించారు బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (Alleti Maheshwar Reddy). కేవలం సన్న బియ్యానికే రూ.500 బోనస్‌ ఇస్తామనడం దారుణం అని అన్నారు. రాష్ట్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎక్కువగా పండేది దొడ్డు బియ్యమే అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నేతలు చావుకబురు చల్లగా చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రమే సన్నబియ్యం పండిస్తారని అన్నారు. 30 జిల్లాల్లోని రైతులు దొడ్డు బియ్యం పండిస్తున్నారని తెలిపారు.

స్వేచ్చగా రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి అని అన్నారు. తేమ పేరుతో క్వింటాలుకు పది నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారని పేర్కొన్నారు. సివిల్ సప్లై డైరెక్టర్ చౌహాన్ కు వ్యవసాయ శాఖ గురించి తెలియదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ళలో 10 నుంచి 12 కిలోల తరుగు ఏవరి జేబులోకి వెళ్తోంది అని ప్రశ్నించారు. ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. అందులో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరుగు పేరుతో తీస్తున్నారని పేర్కొన్నారు.

మంత్రి ఉత్తమ్ పై సంచలన ఆరోపణలు..

తెలంగాణలో కొత్తగా U- ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సివిల్ సప్లై శాఖలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసి డిల్లి పంపింది వాస్తవం కాదా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి ఉత్తమ్ డిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన CMR రైస్ ఎంత మేరకు ఇచ్చారు?, డిఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్లకు మళ్ళీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారు?, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు.

Also Read : గగనంలో దేశభక్తిని చాటిన గోపిచంద్!

Advertisment
తాజా కథనాలు