ఎంఐఎంతో బీజేపీ(BJP) తో ఎప్పుడూ కలవలేదని అన్నారు. కడియంకు తొందర ఉంటే ... పాత మిత్రుడు రేవంత్(Revanth) తో కలవచ్చు అని చురకలు అంటించారు. కడియం మాటలు కాంగ్రెస్ కి వార్నింగ్ ల ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది.. ఈటల కామెంట్స్
రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సీట్లు, ఓట్లు పెరిగాయని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మంచి విజయాలు సాధించిందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపీ స్థానాలు గెలుస్తామని.. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈటల.
ALSO READ: BREAKING : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం