ఎంఐఎంతో బీజేపీ పొత్తు.. రఘునందన్ రావు క్లారిటీ! ఎంఐఎంతో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదని అన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి కడియం చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. By V.J Reddy 09 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Raghunandan Rao: దుబ్బాక మాజీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొన్ని నెలల్లో కూలిపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. ఆ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుందని తేల్చి చెప్పారు రఘునందన్ రావు. ALSO READ: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్! ఎంఐఎంతో బీజేపీ(BJP) తో ఎప్పుడూ కలవలేదని అన్నారు. కడియంకు తొందర ఉంటే ... పాత మిత్రుడు రేవంత్(Revanth) తో కలవచ్చు అని చురకలు అంటించారు. కడియం మాటలు కాంగ్రెస్ కి వార్నింగ్ ల ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది.. ఈటల కామెంట్స్ రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సీట్లు, ఓట్లు పెరిగాయని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మంచి విజయాలు సాధించిందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపీ స్థానాలు గెలుస్తామని.. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈటల. ALSO READ: BREAKING : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం #bjp #telugu-latest-news #bjp-raghunandan-rao #kadiyam-srihari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి