TS Politics: కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్.. కాంగ్రెస్ లాభపడింది కానీ బలపడలే: లక్ష్మణ్

గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో కాంగ్రెస్ పార్టీ లాభపడింది కానీ.. బలపడలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై తమ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందన్నారు.

BJP MP Laxman: హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
New Update

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ (BJP MP Laxman) అన్నారు. ఐదున్నర లక్షల అప్పు ఉందని తెలిసే కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆరు గ్యారెంటీలను ఇచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలకు నిధులు ఎలా తేస్తారో స్పష్టత లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో బీసీ బంధు, దళిత బంధు మద్దతు ధర ఊసే లేదన్నారు. మొదటి కేబినెట్ లో మెగా డీఎస్సీపై ప్రకటన ఉంటుందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ ఇతర వర్గాలపై పడిందన్నారు. దీంతో నష్టపోయిన వర్గాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కోసం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Telangana Assembly:”అచ్చోసిన ఆంబోతులు”…కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

కర్ణాటక ఆర్టీసీ జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని పరిశీలిస్తే ఆరు గ్యారెంటీల అమలు పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ ఇతర వర్గాలపై పడిందన్నారు. దీంతో నష్టపోయిన వర్గాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కోసం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించారు. కర్ణాటక ఆర్టీసీ జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందన్నారు.

ఇది కూడా చదవండి: KTR: ‘సిగ్గుపడుతున్నాం..’ గవర్నర్‌ ప్రసంగంపై అసెంబ్లీలో కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు!

ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక రావడంతో కాంగ్రెస్ లాభపడిందన్నారు. అంతే కానీ ఆ పార్టీ బలపడలేదన్నారు. ఇచ్చిన హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే తాము ఉరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన వంద రోజులు దాటిన తర్వాత ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు.

నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్ కు ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికలపై సైతం కిషన్ రెడ్డి స్పందించారు. అధ్యక్షుడి హోదాలో పార్లమెంట్ ఎన్నికల పై కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని అన్నారు. అధిష్టానం చెప్పిన దాన్ని తుచా తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు.

#bjp-telangana #bjp-laxman #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe